ప్రపంచ దేశాలకు క్యూబా ఆదర్శంగా నిలుస్తుంది - GOVERNMENT JOBS

Friday, March 27, 2020

ప్రపంచ దేశాలకు క్యూబా ఆదర్శంగా నిలుస్తుంది

                      ప్రపంచ దేశాలకు క్యూబా ఆదర్శంగా నిలుస్తుంది 

కరోనా మహమ్మారి ప్రబలిన దేశాలు ఇప్పుడు వైద్య సదుపాయాన్ని  అర్ధిస్తున్నాయి . 

ఈ విజ్ఞప్తి కి సుసంప్పన్న  దేశాలు  స్పందించక పోయిన  , బుల్లి దేశం క్యూబా  ధైర్యంగా  ముందుకొచ్చి  కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న  ఇటలీ ,స్పెయిన్  తదితర దేశాలకు  వైద్య బృందాన్ని పంపుతుంది . 

యాంటీ వైరల్ చికిత్స అందించడం తమ  దేశంలో లోనే  పెద్ద ఎత్తున  మాస్కుల  తయారీ ద్వారా కరోనా వైరస్  ఎదుర్కోవడం  లో  ప్రపంచ  దేశాలకు   క్యూబా  ఆదర్శంగా  నిలుస్తుంది . 

 వైద్యులకు పెట్టింది  పేరు 

కొన్ని దశాబ్దాల కిందట  క్యూబాలో  వచ్చిన  అంటూ వ్యాధికి  అనేక మంది బలయ్యారు  . ఏ దేశము దీనికి వైద్య సాయం అందివ్వలేదు  దీంతో  క్యూబా కమ్యూనిస్ట్ దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రో  తమ దేశంలో  పెద్ద ఎత్తున  వైద్యుల్ని  తయారుచేయాలని  నిశ్చయించింది . 

దేశాన్ని  డాక్టర్ల ఉత్పత్తి  ఫ్యాక్టరీ గా  మలచారు . 
క్యూబాలో  ప్రస్తుతం  ప్రతి 1000 మందికి  8. 2 మంది  డాక్టర్ లు ఉన్నారు . 

ఇటలీలో   ప్రతి 1000 మందికి  4. 1 మంది  డాక్టర్ లు  ఉన్నారు 

అమెరికా లో ప్రతి 1000 మందికి 2. 6 మంది డాక్టర్లు  ఉన్నారు 

దక్షిణ కొరియా లో  ప్రతి 1000 మందికి 2. 4 మంది   డాక్టర్లు  ఉన్నారు 

చైనా లో  ప్రతి 1000 మందికి  1. 4  మంది  డాక్టర్లు  ఉన్నారు 

భారత్ లో  ప్రతి 1000 మందికి  0.62 మంది  డాక్టర్లు  ఉన్నారు 


1960 నుంచి  క్యూబా  డాక్టర్లు  స్పెషలిస్టులు  డజన్లకొద్దీ  వర్ధమాన  దేశాల్లో  37 ,000 మంది  క్యూబా  డాక్టర్స్  పనిచేస్తున్నారు .  

ఇతర దేశాల్లో వైద్య సేవలు  క్యూబాకు  పెద్ద ఎత్తున  ఆదాయాన్ని  తెచ్చి పెడుతున్నారు . 

2018 లో క్యూబా  విదేశీ  ఆదాయాల్లో  దాదాపు  43% వైద్యసేవలదే 

 governmentjobsvjNo comments:

Post a Comment