ముఖ్యమంత్రి జగన్ గారి ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు - GOVERNMENT JOBS

Sunday, March 22, 2020

ముఖ్యమంత్రి జగన్ గారి ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు

   ముఖ్యమంత్రి జగన్ గారి ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు


★ దేశంలో భయానక  వాతావరణం ఉంది. మిగతా రాష్ట్రాల ఏ.పీ కంటే మెరుగ్గా ఉంది.
★ ఏ. పీలో  మార్చి 31 వరకు లాక్ డౌన్.

★ ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి.
★ అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసేస్తున్నాం.
★ అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు.
★ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు బంద్.
★ నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్.
★ పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాం. అన్ని జాగ్రత్తలూ      తీసుకున్నాకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.
★ ప్రతి కుటుంబానికి రూ. 1000 ఇస్తాం.
★  రేషన్ కార్డు ఉన్న అందరికి రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తాం

★ ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని వెల్లడి.
★ ఉద్యోగులకు విడతల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
★ విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
★ అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దు. అందరూ ఇళ్లలోనే ఉండండి. ప్రజలకు ఇదే నా        విజ్ఞప్తి.
★ కూరగాయలు, పాలు, మెడిసన్‌ కోసమే బయటకు రండి.
★ నిత్యావసర దుకాణాలు తప్ప అన్నింటినీ బంద్‌ చేస్తునన్నాం.
ఈ నెల 31వరకు ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్..

 కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు

* రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు మార్చి 29 నాటికే ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ. అదనంగా కిలో పప్పు అందజేత.
* తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఏప్రిల్ 4న వలంటీర్ల ద్వారా రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేత.
* దీని కోసం రూ.1500 కోట్లు కేటాయింపు.
* పింఛన్ల పంపిణీలో ఏప్రిల్ కు సంబంధించి బయోమెట్రిక్ విధానం రద్దు .
* అత్యవసర సరుకులు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు.
* విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
* పదో తరగతి పరీక్షలు యథాతధం గా జరుగుతాయి.
* విద్యార్థులకు దూరం దూరంగా సీటింగ్ కేటాయింపు.
*  ఉద్యోగులు 80%మంది రావాల్సిన అవసరంలేదు..
* కానీ మిగిలిన  20% మంది రోటేషన్ పద్ధతిలో రావాలి..
* అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందరూ రావాలి.
* ప్రభుత్వ ఉద్యోగుల విధులపై త్వరలోనే క్లారిటీస్తాం.
* వీలయినంత త్వరలో అతి కొద్ది రోజులు ఏపీ బడ్జెట్ సమావేశాలు.
* వృద్ధులు, పిల్లలు ఎవరు ఇల్లు దాటి బయటకు రావద్దు..
* అత్యవసర సరుకుల కోసం కుటుంబంలో ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచన.
* ఎలాంటి పరిస్థితుల్లో 10 మందికి మించి గుమిగూడదు..
* 1897చట్టం ప్రకారం ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులకు ఈ వారం రోజుల జీతం చెల్లించాలి.
* వైద్యసేవల్లో అత్యవసర సేవలు తప్ప, అన్ని రద్దు..
* అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సర్వీసులన్నీ రోడ్లపైకి రావద్దు .
 ముఖ్యమంత్రి జగన్ గారి ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు


No comments:

Post a Comment