గ్రామపంచాయతీ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్ , వ్యవస్థ గురించి ముఖ్యమైన బిట్స్ - GOVERNMENT JOBS

Tuesday, March 17, 2020

గ్రామపంచాయతీ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్ , వ్యవస్థ గురించి ముఖ్యమైన బిట్స్

     గ్రామపంచాయతీ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్ , వ్యవస్థ గురించి                                                ముఖ్యమైన బిట్స్ 


1. ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ?

A . ఎన్ . టి. రామారావు 

2. మన రాష్ట్రము లో అమలులోఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏది ?

A . గ్రామపంచాయతీ ,మండలపరిషత్తు ,జిల్లా పరిషత్తు 

3. నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని అంచెల విధానం అమలులో ఉంది ?

A. 3 అంచెల విధానం 

4. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు గ్రామపంచాయతీ లను  ఎవరు ఏర్పాటు చేస్తారు ?

A. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ,జిల్లా కలెక్టర్ 

5. సాధారణంగా ఎంత జనాభా కు తగ్గకుండా ఉన్న గ్రామాలలో ఒక గ్రామపంచాయతీ ని ఏర్పాటు చేస్తారు ?

A . 300

6. పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా హృదయం గా  ,స్థానిక సభ గా  దేనిని వర్ణిస్తారు ?

A . గ్రామసభ 

7. గ్రామసభ ప్రతి సంవత్సరం ఏ తేదీలో తప్పక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది ?

A. ఏప్రిల్ 14, జనవరి 2 ,అక్టోబర్ 3, జులై 4

8. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలు గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి ఎన్ని పర్యాయాలు నిర్వహిస్తున్నాయి ?

A. 4

9. గ్రామసభ కు ఎవరు అధ్యక్షత వహిస్తారు ?

A . సర్పంచ్ , లేదా ఉపసర్పంచ్ 

10. గ్రామసభ సమావేశాలు ఎన్ని పర్యాయాలు నిర్వహించకపోతే  సర్పంచ్ తన పదవి ని  కోల్పోయి ,సంవత్సరం వరకు ఎన్నికకు  అనర్హులు అవుతారు ?

A . 2

11. ఓటు హక్కు కలిగిన వారిలో ఎంత మంది లేదా ఎంత శాతం ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి ?

A. 50మంది లేదా 10శాతం 

12. గ్రామాన్ని దేని ప్రాతిపదికన వార్డులుగా విభజించడం జరుగుతుంది ?

A . జనాభా 

13. పంచాయతీ సభ్యుడు లేదా వార్డు సభ్యుని పదవీకాలం ఎంత ?

A. 5 సంవత్సరాలు 

14. 300 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A. 5 వార్డులు 

15. 300నుండి  500 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A . 7 వార్డులు 

16. పంచాయతీ వార్డు సభ్యుడు ఎన్ని రోజులు నిరవధికంగా పంచాయతీ సమావేశాలకు హాజరుకాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు ?

A. 90 రోజులు 

17. 500నుండి  1500 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A . 9 వార్డులు 

18. 1500నుండి  3000 వరకు  జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A. 11 వార్డులు 

19. 3000నుండి 5000 వరకు  జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A. 13 వార్డులు 

20. 5000 నుండి  10000వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A . 15 వార్డులు 

21. ఈ క్రింది వారిలో ఎవరు గ్రామపంచాయతీ చర్చల్లో లేదా లేదా సమావేశాల్లో శాశ్వత  ఆహ్వానితునిగా  పాల్గొనవచ్చును ?

A . మండలపరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎం . టి . పి . సి )

22. 10,000నుండి 15,000వరకు  జనాభా కలిగిన గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A. 17 వార్డులు 

23. 15000 పైన జనాభా కలిగిన గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు ?

A . 19 నుండి  21  వార్డులు 

24. గ్రామపంచాయతీ సమావేశాలలో పాల్గొనే సభ్యులు ఎవరు ?

A . గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ,  ఎం  పి  టి సి  సభ్యులు  గ్రామపంచాయతీ కో ఆప్టెడ్ సభ్యులు , మండల పరిషత్తు కో ఆప్టెడ్ సభ్యులు 

25. గ్రామపంచాతి సమావేశాన్ని సర్పంచ్ ఎన్ని రోజులకొకసారి నిర్వహించాలి ?

A. 30రోజుల కొకసారి

26. గ్రామపంచాయతీ సమావేశాల కోరం మొత్తం సభ్యులను ఎన్నో వంతు సభ్యులుగా నిర్ణయించడం జరిగింది ?

A . 1/3 వంతు

27. గ్రామ పంచాయతీ అధిపతిని ఏమని పిలుస్తారు ?

A. సర్పంచ్ / అధ్యక్షుడు

28. ఎవరు పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా ఓటర్ల చేత ఎన్నికవుతారు ?

A . సర్పంచ్

29. గ్రామసర్పంచ్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారు ?

A. 5 సంవత్సరాలు

30. గ్రామసర్పంచ్ గ పోటీ చేయడానికి కనీస వయస్సు ఎన్ని సంవత్సరాలు నిర్ణయించారు ?

A. 21 సంవత్సరాలు

31. గ్రామపంచాయతీ సమావేశం నిర్వహించుటకు వీలు లేనప్పుడు గ్రామసర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించవచ్చు ?

A . జిల్లా పంచాయతీ అధికారి

32. అధికార దుర్వినియోగానికి ,అవినీతికి  పాల్పడిన సర్పంచ్ ను  ఎవరు తొలగిస్తారు ?

A . జిల్లా కలెక్టర్

33. గ్రామ సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలు లోపల ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ?

A. 4 నెలలు

34. ఉప సర్పంచ్ పదవిలో ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల లోపల  ఉప ఎన్నికను గ్రామసర్పంచ్  నిర్వహిస్తారు ?

A. 30రోజులు

35. గ్రామపంచాయతీ  ఆహార విద్య  పారిశుధ్య కమిటీకి  చైర్మన్ గా  ఎవరు వ్యవహరిస్తారు ?

A . గ్రామ సర్పంచ్

36. గ్రామ ఉపసర్పంచ్  ఎవరి చేత ఎన్నుకోబడతారు ?

A. గ్రామపంచాయతీ వార్డు సభ్యులు

37. గ్రామ ఉపసర్పంచ్  పదవి కాలం ఎంత ?

A. 5 సంవత్సరాలు

38. గ్రామ ఉపసర్పంచ్  ఎన్నికను  ఎవరు నిర్వహిస్తారు ?

A . జిల్లా పంచాయతీ అధికారి

39. ఎవరిని అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చును ?

A . గ్రామ ఉపసర్పంచ్

40. ఎవరిని అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించలేరు ?

A. గ్రామసర్పంచ్

41. ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు ?

A . మండల పరిషత్తు అభివృద్ధి అధికారి

42. ఉపసర్పంచ్  పై అవిశ్వాస తీర్మాన  నోటీసు ను  సభ్యులు ఎవరికి  సమర్పించాలి ?

A . రెవిన్యూ డివిజన్ అధికారి

43. గ్రామ పంచాయతీ పరిపాలనాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు ?

A . పంచాయతీ కార్యనిర్వహణాధికారి

44. జనన మరణాల రిజిస్టర్ ను  ఎవరు నిర్వహిస్తారు ?

A. పంచాయతీ కార్యదర్శి

45. కుల ధ్రువీకరణ  ఆదాయ పత్రాల జారీ విషయంలో ప్రాధమిక రిపోర్ట్ ఎవరు సమర్పిస్తారు ?

A. పంచాయతీ కార్యదర్శి

46. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు  శాశ్వత ఆహ్వానితులుగా  ఎవరుంటారు ?

A. గ్రామసర్పంచ్

47. గ్రామ రికార్డులను అకౌంట్స్  ఎవరు నిర్వహించాలి ?

A. పంచాయతీ కార్యనిర్వహణాధికారి

48. ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ ప్రభుత్వాలు  ప్రస్తుతానికి  ఎన్ని అంశాలను మాత్రమే పంచాయతీలకు  బదలాయించింది ?

A . 10 అంశాలు

49. ఏ రాష్ట్రాలలో పంచాయతీలకు  29 అంశాలను  బదలాయించడం జరిగింది ?

A . కర్ణాటక ,కేరళ ,తమిళనాడు ,సిక్కిం

50. గ్రామ పంచాయతీ  ఆదాయం ఎంతకంటే ఎక్కువగా ఉంటె ఆ పంచాయతీని నోటి పైడ్  పంచాయతీ  గా పేర్కొంటారు ?

A. 60,000

51. గ్రామపంచాయతీ ఆవశ్యక విధి ఏమిటి ?

A. విధి దీపాలు ఏర్పాటు

52. ఏ కమిటీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ లో రెండవ అంచె లేదా మధ్యస్థ స్థాయి అంచెగా పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు ?

A. బల్వంతరాయ్ మెహతా

53. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ మండలం పంచాయతీని ఏ పేరుతో వ్యవహరిస్తారు ?

A . మండలపరిషత్

54. గుజరాత్ ,కర్ణాటక రాష్ట్రాల్లో  మండల పంచాయతీని ఏ పేరుతో వ్యవహరిస్తారు ?

A. తాలూకా పంచాయతీ

55. అరుణాచల్ ప్రదేశ్  లోని మండల పరిషత్ ను ఏ పేరుతో వ్యవహరిస్తారు ?

A. అంచల్ కమిటీ

56. ఉత్తరప్రదేశ్ లోని మండల పంచాయతీని యేమని పిలుస్తారు ?

A . క్షేత్ర పంచాయతీ

57. మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల సభ్యులు ఎవరి చేత ఎన్నికవుతారు ?

A . ఓటర్లు

58. మండల పరిషత్  ప్రాదేశిక నియోజక వర్గాల సభ్యులు పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ?

A . 5 సంవత్సరాలు

59 . ఎంత జనాభా కలిగిన ప్రాంతాలను ఎం పి టి సి స్థానాలు గా నిర్ణయిస్తారు ?

A. 3 నుండి  4 వేలు

60. ఒక మండలంలో కనీసం ఎన్ని ఎం పి టి సి స్థానాలకు తగ్గకుండా ఎన్ని ఎం పి టి సి స్థానాలకు మించకుండా నిర్ణయిస్తారు ?

A. 7 ,కి తగ్గకుండా 23 కి మించకుండా

61. మండలాధ్యక్షుని పదవి కాలం ఎన్ని సంవత్సరాలు ?

A . 5 సంవత్సరాలు

62. ఎవరు మండలపరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరు అవుతారు ?

A. జిల్లా పరిషత్ చైర్మన్ , జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
63. ఎవరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు ?
A . మండలాధ్యక్షుడు ,ఉప మండలాధ్యక్షుడు

64. మండలాధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మాన నోటీసుపైన  మొత్తం సభ్యులలో ఎంత శాతం సభ్యులు సంతకాలు చేయవలసి ఉంటుంది ?
A . 50శాతం
65.  మండలాధ్యక్షుడు మరియు ఉపమండలాధ్యక్షుడు పై అవిశ్వాస తీర్మాన నోటీసును సభ్యులు ఎవరికి ఇవ్వాలి ?
A . రెవిన్యూ డివిజన్ అధికారి
66.  ఎంత మెజారిటీ తో మండలాధ్యక్షుడిపై మరియు మండల ఉపాధ్యక్షుడు అవిశ్వాస తీర్మానం ఆమోదించక పోతే వారు తొలగించడం జరుగుతుంది ?
A. 2/3 వంతు
67. మండలాధ్యక్షుడు  తన రాజీనామా ను మండల పరిషత్తు కు సమర్పించడం కుదరని పక్షంలో ఎవరికి సమర్పిస్తారు ?
A. జిల్లా పంచాయతీ కార్యనిర్వహణాధికారి 
68. మండల పరిషత్తు అధ్యక్షుడు తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు ?
A . మండల పరిషత్తు
69. మండల పరిషత్తు కార్యనిర్వహణాధికారి అయిన మండల పరిషత్తు అభివృద్ధి అధికారి ని ఎవరు నియమిస్తారు ?
A . రాష్ట్ర ప్రభుత్వం
70. మండలపరిషత్తు కు సలహా పూర్వక అంగంగా వ్యవహరించేది ఏది ?
A. మండల మహాసభ
71. మండల మహాసభ లో ఎవరు సభ్యులుగా ఉంటారు ?
A . గ్రామపంచాయతీ సర్పంచ్ ,మండలపరిషత్ సభ్యులు 
72. రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తి బదిలీలపై మోపు 2%సర్ చార్జీలను గ్రామపంచాయతీ ,మండలపరిషత్తు ,జిల్లాపరిషత్తు లకు ఏ నిష్పత్తిలో పంపిణి చేయడం జరుగుతుంది ?
A . 3:1:1

73. ఇసుక పై వచ్చే సీనరేజ్ రుసుమును  పంచాయతీ లు  మండల పరిషత్ జిల్లా పరిషత్ లు ఏ నిష్పత్తిలో పంపిణి చేయడం జరుగుతుంది ?
A. 25:50:25

74. వినోదపు పన్ను లో 90శాతం గ్రామపంచాయతీ ,మండలాలకు ఏ నిష్పత్తిలో పంపిణి చేస్తారు ?
A . 60:40

75. మండలపరిషత్తు ఆదాయమార్గం ఏది ?
A . గ్రామపంచాయతీ లపై లేవి ద్వారా వచ్చే వసూళ్లు , కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అందించే గ్రాంట్లు 

76. జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు ఎవరి చేత నియమించబడతారు ?
A . ఓటర్లు 
77. జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ?
A. 5 సంవత్సరాలు 
78. ఎవరు జిల్లా పరిషత్తు కు హోదారీత్యా సభ్యులుగా ఉంటారు ?
A . జిల్లా లోక్ సభ మరియు విధానసభ సభ్యులు ,రాజ్యసభామరియు విధానపరిషత్  సభ్యులు 
79.  ఎవరికి జిల్లా పరిషత్ సమావేశాలలో ఓటు హక్కు ఉంటుంది ?
A . జిల్లా కో ఆప్టెడ్ సభ్యులు 
80. జిల్లా పరిషత్ చైర్మన్  వైస్ చైర్మన్ పదవీకాలం ఎంత ?
A . 5 సంవత్సరాలు 
81. ఏ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై విశిష్ట పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు జిల్లా పరిషత్తు ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతారు ?
A. పంచాయతీ వ్యవస్థ 
82. జిల్లా పరిషత్తు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ను ఎవరు ఎన్నుకొంటారు ?
A . జడ్ పి టి సి సభ్యులు 
83.ఎవరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు( జడ్ పి టి సి) అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించగలరు ?
A . జిల్లా పరిషత్ చైర్మన్ , జిలా పరిషత్ వైస్ చైర్మన్ 
84. జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానపు నోటీసును జడ్ పి టి సి సభ్యులు ఎవరికి సమర్పిస్తారు ?
A . జిల్లా కలెక్టర్ 
85. జిల్లా పరిషత్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం నందు మొత్తం సభ్యులలో ఎన్నో వంతు సభ్యుల మెజారిటీ తో తీర్మానాన్ని ఆమోదిస్తే తొలగించడం జరుగుతుంది ?
A . 2/3 వంతు 
86. జిల్లా పరిషత్ చైర్మన్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు ?
A . జిల్లా పరిషత్తు 
87. చైర్మన్ ,వైస్ చైర్మన్ నిరవధికంగా ఎన్ని రోజులకు మించి హాజరు కాకపోతే చైర్మన్ విధులను జిల్లా పరిషత్ లోని  సభ్యునికి రాష్ట్రప్రభుత్వం అధికారాన్ని బదలాయిస్తుంది ?
A . 15 రోజులు 
88. జిల్లా విద్యా కమిటీ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
A. జిల్లా పరిషత్ చైర్మన్ 
89. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
A . జిల్లా పరిషత్తు చైర్మన్ 
90. జిల్లా గ్రామీణ ఉపాధి కల్పన మరియు పేదరిక నిర్ములన మిషన్ కు చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
A . జిల్లా పరిషత్ చైర్మన్ 
91. జిల్లా ఉపాధ్యాయ బదిలీల కమిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
A . జిల్లా పరిషత్ చైర్మన్ 
92. మండల విద్యాకమిటీకి వైస్ చైర్మన్ గా ఎవరుంటారు ?
A . మండల పరిషత్ అధికారి( ఏం పి డి ఓ )
93. మండల పరిషత్ పాఠశాలలకు సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ గా ఎవరు ఉంటారు ?
A. మండల్ పరిషత్ అధికారి 
94. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ని రోజులకు ఒక పర్యాయం జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహించాలి ?
A. 90రోజులు 
95. జిల్లా పరిషత్ కు పాలనా పరమైన అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు ?
A . ముఖ్యకార్యనిర్వహణాధికారి 
96. జిల్లా పరిషత్ లో ఎన్ని స్థాయి సంఘాలు ఉంటాయి ?
A . 7

97. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్ ,ఆడిట్ నివేదికలను ఎవరు పరిశీలిస్తారు ?
A. జిల్లా మహా సభ 
98. వ్యయసాయ స్థాయి సంఘానికి ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు ?
A . జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 
99. స్థాయి సంఘాలు సమావేశాలు ఎన్ని  రోజులకఒకసారి  తప్పని సరిగా జరగాలి ?
A. 60 రోజులు 
100. స్థాయి సంఘాల అధ్యక్షులను ఎవరు నియమిస్తారు ?
A . జిల్లా పరిషత్ చైర్మన్ 


No comments:

Post a Comment