వాహన దారులకు గుడ్ న్యూస్
కరోనా కారణంగా దేశవ్యాప్తమగా అమలవుతున్న లాక్ డౌన్ తో దేశంలో ని అనేక మంది వాహన దారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే
అయితే వారికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది .
ఇప్పటికే ఎక్సపైర్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ లు వాహనాల రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ లు పర్మిట్ లు తదితరాలు ఉన్నవారు దిగులు చెందాల్సిన అవసరం లేదని వాటికీ గడువు ను మరికొంత కాలం పెంచుతామని కేంద్రం తెలిపింది .
ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది .
ఫిబ్రవరి 1 వ తేదీ వరకు ఎక్సపైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ లు వాహనాల రిజిష్ట్రేషన్ పర్మిట్ లకు జూన్ 30 వ తేదీ వరకు గడువును పెంచినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది తెలిపింది .
ఈ క్రమంలో ఎక్సపైర్ అయిన సదరు పత్రాలు ఉన్నప్పటికీ జూన్ 30 వ తేదీ వరకు అవి చెల్లుతాయని కనుక సంబంధిత అధికారులు వాటిని ఇంకా ఎక్సపైర్ కానట్లుగానే గుర్తించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది .
కరోనా లాక్ డౌన్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాలు మూసివేసి ఉన్నాయని కనుక ఆయా పత్రాల రెన్యూవల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది .
ఈ క్రమంలో ఎక్సపైర్ అయిన పత్రాలు ఉన్న అధికారులు వాహనదారులను అనుమతి ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది .
No comments:
Post a Comment