50 లక్షల భీమా ప్రమాద భీమా ఎవరికి - GOVERNMENT JOBS

Sunday, March 29, 2020

50 లక్షల భీమా ప్రమాద భీమా ఎవరికి

                        50 లక్షల భీమా ప్రమాద భీమా ఎవరికి 


కరోనా వైరస్ సోకినా రోగులకు చికిత్స సేవలందించే  వైద్యులు  ,ప్రజారోగ్య పరిరక్షణ సిబ్బంది ,సామజిక  ఆరోగ్య  కార్యకర్తలకు కేంద్రప్రభుత్వం ఇవ్వనున్న  50 లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా పై కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ  ఆదివారం విధివిధానాలను ప్రకటించింది . 
కరోనా రోగులకు సేవలందించే  క్రమంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే  ఈ భీమా వర్తిస్తుంది  90 రోజుల పాటు  భీమా సదుపాయం అమల్లో  ఉంటుంది . 

దేశవ్యాప్తంగా 22. 12 లక్షల మందికి ఈ భీమా వర్తిస్తుంది . 

వైద్యులు ,వైద్య నిపుణులు  ఆశావర్కర్లు , పారామెడికల్ సిబ్బంది ,  నర్సులు,  వార్డ్ బాయ్ లు  పారిశుధ్య కార్మికులు , రోగనిర్దారణ నిర్వర్తించే  సిబ్బంది ,ఇతర ఆరోగ్య కార్యకర్తలు 
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  సంబంధించిన  అన్ని ఆరోగ్యకేంద్రాలు ,ఆరోగ్య వికాస కేంద్రాలు ,ఆసుపత్రి లో పని చేసే సిబ్బంది కి 

గతంలో ఎన్నడూ తలెత్తని  పరిస్థితులు  నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది /పదవి విరమణ /పపట్టణ  స్థానిక సంస్థలు /కాంట్రాక్టు / దినకూలీ /తాత్కాలిక /పొరుగుసేవల సిబ్బంది /రాష్ట్రాలు  కేంద్ర ప్రభుత్వం  ఆసుపత్రులు /కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ని  స్వయం ప్రతిపత్తి   ఆసుపత్రులను 

ఎయిమ్స్   ఐ ఎన్ ఐ లు  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో  పని చేసే  ఆసుపత్రులకు కరోనా సంబంధిత  బాధ్యతలను  అప్పగించొచ్చు . 

వీరెవరైనా  కరోనా  చికిత్స సంబంధిత  సేవల్లో  ఉంటె  వారికీ ఈ భీమా  వర్తిస్తుంది . 

ఆయా సిబ్బంది కి  ఇప్పటికె  ఏవైనా  భీమాలుంటే  వాటికీ  అదనంగా  ఈ భీమా సదుపాయం  వర్తిస్తుంది  


 governmentjobsvj

No comments:

Post a Comment