తిరుమల తిరుపతి దేవస్థానం 2020-2021 బడ్జెట్ 3,309. 89 కోట్లు
2021-2021ఆర్థిక సంవత్సరానికి టి టిడి వార్షిక బడ్జెట్ ను 3,309. కోట్లు గా నిర్ణయించింది .
ఫిబ్రవరి 29 తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టి టి డి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలిపింది .
- సమావేశంలో పలు అభివృద్ధి పనులు ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు .
- బడ్జెట్ లో ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారం భక్తుల సౌకర్యాలు ,దేవాలయ నిర్మాణాలు , విద్య ,వైద్యం , ఆరోగ్యం ,పరిశుభ్రత ,లకు ప్రాధాన్యం ఇచ్చారు .
- గత ఏడాది తో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ 66 కోట్లకు పైగా పెరిగింది .
పాలక మండలిలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
- తిరుమలలో బూందీ పోటు లో అగ్నిప్రమాదాల నివారణకోసం 3. 30 కోట్లతో అధునాతన థర్మో ఫ్లూయిడ్ కడాయిలు ఏర్పాటుకు ఆమోదం
- జూపార్క్ సమీపంలో 14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్ భవనం 34 కోట్లతో ఎస్వీ బధిర పాఠశాల హాస్టల్ భవనాల నిర్మాణానికి ఆమోదం
- ఇన్ఫోసిస్ సహకారంతో టి టి డి లో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారి ని నియమించాలని నిర్ణయం .
- జమ్మూ ,వారణాసి ముంబై లలో త్వరలో శ్రీవారి ఆలయాల నిర్మాణం .
- అలిపిరి టోల్ గేట్ వద్ద ద్విచక్ర వాహనాలకు ఇప్పుడు వాసులు చేస్తున్న రుసుము 2 రూపాయలు రద్దు .
- జీపులు చిన్న వాహనాలకు స్లాబులు తొలగించి , అన్నింటికి 50రూపాయలు వసూలు .
- భారీ వాహనాలకు ఇపుడున్న 100రూపాయలు స్థానంలో 200రూపాయలు పెంపు .
బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలు
2019-2020 2020-2021
1. హుండీ ద్వారా ఆదాయం -------- 1,313కోట్లు 1,350కోట్లు
2. పెట్టుబడులద్వారా వడ్డీ ద్వారా ----857. 28కోట్లు 706.01కోట్లు
3. బ్రేక్ దర్శనాల ద్వారా -------------330కోట్లు 400కోట్లు
4. ప్రసాదాల విక్రయం ద్వారా ------233కోట్లు 2245కోట్లు
5. తలనీలాలు విక్రయాల ద్వారా ----106. 75 కోట్లు 106. 75కోట్లు
6. సెక్యూరిటీ డిపాజిట్లు రుణాలు -----66. 55కోట్లు 67. 03కోట్లు
7. కాటేజీలు ,విశ్రాంతి గదులు ,
కల్యాణ మండపాలు -----------110కోట్లు 110కోట్లు
8. ఆర్జిత సేవ టికెట్స్ ----------57కోట్లు 57కోట్లు
9. శ్రీవారి ట్రస్టులు ------------60కోట్లు 60కోట్లు
10. కాలేజీ డొనేషనలు ------00 100కోట్లు
11. అద్దె, కరెంటు ధరలు ,నీటి చార్జీలు ---52.50కోట్లు 52. 50కోట్లు
12. ఇతర ఆదాయ వనరుల ద్వారా -----36.10 33. 60
13. ముదిరించిన ప్రచార విక్రయాలు ----21 కోట్లు 21 కోట్లు
No comments:
Post a Comment