డిగ్రీ , బిటెక్, పాలిటెక్నిక్ , పీజీ విధ్యార్ధులకు విద్యా దీవెన కార్డులు
ఫిబ్రవరి 24 వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా విజయనగరం జిల్లాలో జగనన్న విద్యా దీవెన ,వసతి దీవెన పధకాన్ని ప్రారంభించనున్నారు .
అదేరోజు జిల్లాలో ఐ టి ఐ ,పాలిటెక్నిక్ ,,డిగ్రీ పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్స్ లు చదువుతున్నా విద్యార్థులకు అందించేందుకు విద్యా దీవెన కార్డులను అధికారులు సిద్ధం చేస్తున్నారు .
ఈ నేపథ్యంలో సంత బొమ్మాలి మండలంలో పలు గ్రామాల సచివాలయాలకు కార్డులను పంపారు .
80మందికి పైగా వాలంటీర్ లకు కార్డులు రావడంతో వాటిని వారు ముందే తీసేసుకున్నారు .
వాలంటీర్లు చదువుకుంటున్నట్లు గుర్తిస్తే వారిని తొలగించాలని ఇటీవల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు .
గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ నవశకం ద్వారా ఈ పథకాలకు సంబంధించి సర్వే చేసారు .
చదువుకుంటున్న పలువురు గ్రామ వాలంటీర్లు నవశకం వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవడంతో కార్డులు మంజూరయ్యాయి .
No comments:
Post a Comment