దేశంలోనే తోలిసారిగా బాలల పార్కు ఆంధ్రప్రదేశ్ - GOVERNMENT JOBS

Saturday, February 15, 2020

దేశంలోనే తోలిసారిగా బాలల పార్కు ఆంధ్రప్రదేశ్

       దేశంలోనే తోలిసారిగా బాలల పార్కు ఆంధ్రప్రదేశ్ 

 • దేశంలోనే తొలిసారిగా ఆల్  ఎబిలిటీ  చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు అయ్యింది . 
 • దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు . 
 • పార్కు అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు . చెంగు చెంగున అక్కడున్నవన్నీ ఎక్కేస్తూ అలుపు సొలుపూ లేకుండా ఆడేస్తారు . 
 • అందుకే ఎలాంటి పిల్లలయినా  ఆడుకోగలిగేలా  ఓ పార్కును  విశాఖపట్నంలో కట్టేశారు . 
 • ఆర్ కె బీచ్ రోడ్ లో ఆల్ ఎబిలిటీ చిల్డ్రన్ పార్క్ పేరుతో స్మార్ట్ సిటీ మిషన్ కింద దేశంలోనే తొలిసారిగా  3కోట్ల తో ఏర్పాటు చేశారు . 
 • దీన్ని చూసి కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఉన్నత అధికారులు  ఫిదా అయ్యారు . 
 • దేశ వ్యాప్తంగా అన్ని ఆకర్షణీయ నగరాల్లోనూ ఇలాంటి పార్కులను నిర్మించేందుకు వెంటనే ప్రణాళికలు రూపొందించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు . 
 • దివ్యాంగులు చక్రాల కుర్చీలో కూర్చునే పార్కు నంత చుట్టొచ్చేలా ,సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి బీచ్ అందాలు చూసేలా  ప్రత్యేక పై బాట నిర్మించారు . 
 • వీరి కోసం ప్రత్యేక ఊయల ఏర్పాటు చేశారు . 
 •  పిల్లలకు బోటులో వెళ్లే అనుభూతి వచ్చేలా పెద్ద బొమ్మ నౌకను ,అందులో నే పిల్లలు అమాంతం ఎగిరి ఆడుకొనే లా  వలను ఏర్పాటు చేశారు . 
 • ఆడుకుంటూ పిల్లలు కింద పడ్డా దెబ్బ తగలకుండా పార్క్ మొత్తం రబ్బర్ ఫ్లోరింగ్ అమర్చారు . పచ్చికతో ముస్తాబు చేశారు . 
 • చూపు లేని పిల్లలు శబ్దాల ద్వారా ఆనందించే ఆటవస్తువులు ఇక్కడ ఉన్నాయి 
 • ఒక వైపు మాట్లాడితే మరొక వైపు నుంచి ఇంకొకరు వినేయవచ్చు . 
 దేశంలోనే తోలిసారిగా బాలల పార్కు ఆంధ్రప్రదేశ్

No comments:

Post a Comment