రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హతలు
ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ఇంటి వద్దకే నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకుల అందజేత
ప్రయోజనాలు :అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇంటి వద్దకే నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రత్యేకంగా బియ్యం కార్డు ల జారీ
అర్హతలు :కుటుంబ ఆదాయపరిమితి: నాడు నెలసరి ఆదాయము గ్రామీణ ప్రాంతాలలో 5,000లోపు పట్టణ ప్రాంతాలల్లో 6250
నేడు కుటుంబ నెలసరి ఆదాయ గ్రామీణ ప్రాంతాలల్లో 10,000కు పెంచారు .
పట్టణ ప్రాంతాలల్లో 12000కు పెంచారు
భూ యాజమాన్య పరిమితి :నాడు కుటుంబానికి 2. 5 ఎకరాల లోపు మాగాణి 5 ఎకరాల లోపు మెట్ట ,లేదా మెట్ట లేదా మాగాణి 10ఎకరాలు లోపు ఉన్న వారు అర్హులు .
నేడు కుటుంబానికి మాగాణి 3 ఎకరాల లోపు ,మెట్ట 10ఎకరాలు లోపు లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10ఎకరాలు లోపు ఉన్నవారందరూ అర్హులే
విద్యుత్ వినియోగం :నాడు నెలకు 200యూనిట్లు లోపు వినియోగించేవారు మాత్రమే అర్హులు
నేడు విద్యుత్ వినియోగం పరిమితి నెలకు 300యూనిట్ల వరకు పెంచడమైంది .
ప్రభుత్వ ఉద్యోగి మరియు ఫింఛనుదారుడు :నాడు ప్రభుత్వ ఉద్యోగి ఫించను దారుడు అర్హుడు కాదు
నేడు ప్రభుత్వ ఉద్యోగి ఫింఛనుదారుడు అర్హులు కారు (సానిటరీ వర్కర్స్ కు మినహాయింపు )
నాలుగు చక్రాల వాహనం :నాడు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు అర్హులు కారు (టాక్సీకి మినహాయింపు )నేడు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు అర్హులు కారు (టాక్సీ , ట్రాక్టర్ ,ఆటో లకు మినహాయింపు )
ఆదాయపన్ను చెల్లింపు దారులు :నాడు ఆదాయ పన్ను చెల్లింపు దారుల అర్హులు కారు
నేడు ఆదాయ పన్ను చెల్లింపు దారుల అర్హులు కారు
మునిసిపల్ ఆస్తి :నాడు 750చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన వారు అనర్హులు .
నేడు 1000చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన వారు అనర్హులు .
No comments:
Post a Comment