వై ఎస్ ఆర్ ఫించన్ అర్హతలు
కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాలలో -----10,000 లోపు ఉండాలి
పట్టణ ప్రాంతాలలో నెలకు ---12000లోపు ఉండాలి
ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి
మున్సిపల్ , పంచాయతీ శాశ్వత , ఒప్పంద మరియు అవుట్ సోర్సింగ్ ,పారిశుధ్య కార్మికులు అందరూ అర్హులే
శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ అనర్హులు .
సొంత నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు (టాక్సీ ,ఆటో ,ట్రాక్టర్ లకు మినహాయింపు )
భూమి మాగాణి 3 ఎకరాల లోపు ఉండాలి
మెట్ట 10ఎకరాల లోపు ఉండాలి
మొత్తం మాగాణి +మెట్ట 10ఎకరాల లోపు ఉండాలి
కుటుంబ సగటు విద్యుత్ వినియోగం 6 నెలలకు 300 యూనిట్ల లోపు ఉండాలి .
కుటుంబ సభ్యులు ఎవ్వరు ఇన్కంటాక్స్ పరిధిలో ఉండకూడదు .
పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు లోపు ఆస్థి పన్ను చెల్లించే వారై ఉండవలెను .
సాధారణంగా ఒక కుటుంబానికి ఒక ఫించన్ మాత్రమే .
1. వృద్దాప్య ఫించను :60సంవత్సరాలు మరియు ఆ పై వయస్సు కలవారు గిరిజనుల కు 50సంవత్సరాలు మరియు ఆ పై వయస్సు కలవారు .
2. వితంతు ఫించన్: వివాహ చట్టం ప్రకారం 18సంవత్సరాల మరియు ఆపై వయస్సు కలవారు మరియు
భర్త మరణం దృవీకరణ పత్రం ఉండాలి .
3. వికలాంగుల ఫించన్ :40%మరియు ఆపైన వికలత్వం కలిగిఉన్నవారు మరియు
SADEREM సర్టిఫికెట్ కలిగి ఉండాలి . వీరికి వయోపరిమితి లేదు .
4. చేనేత కార్మికుల ఫించన్ :వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగి ఉండాలి .
5. కల్లు గీత కార్మికుల ఫించన్ :వయస్సు 50సంవత్సరాల మరియు ఆపైన కలవారు .
ఎక్స్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు .
6. మత్స కారుల ఫించన్ :వయస్సు 50సంవత్సరాల మరియు ఆపైన కలవారు
మత్స శాఖ వారిచే పత్రం కలిగినవారు.
7. HIVబాధితుల ఫించన్ :వయో పరిమితి లేదు ,6నెలలు ట్రీట్ మెంట్ తీసుకున్నవారు .
8. డయాలసిస్ :వయస్సు తో సంబంధంలేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు . (స్టేజి 3, 4, 5.)
9. ట్రాన్స్ జెండర్ :18సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగి ఉండాలి
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు .
10. ఒంటరి మహిళలు :వయస్సు 35సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందిన వారు , భర్త నుండి విడిపోయినవారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి )
11. డప్పు కళాకారులూ :వయస్సు 50సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి
12. చర్మకారుల ఫించన్ :వయస్సు 40సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు .
లబ్ది దారుల జాభితా సాంఘిక సంక్షేమ శాఖ అంధ జేస్తుంది .
13. అభయ హస్తం :స్వయం సహాయక సంఘ సభ్యుల ఎవరైతే అభయ హస్తం పధకంలో వారి కంట్రీ బ్యూషన్ చెల్లించి ఉండి , 60సంవత్సరాలు వయస్సు కలవారు .
14:వివిధ రకాల వ్యాధిగ్రస్థులు : తలసేమియా , సికెల్ సెల్ ఎనిమియా వ్యాధి , తీవ్ర హీమోఫీలియా , ద్వైపాక్షిక బోధ వ్యాధి , పక్ష వాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమిత మైనవారు కుష్ఠు వ్యాధి గ్రస్తులు ఆరోగ్యశ్రీ ద్వారా కిడ్నీ కాలేయము లేదా గుండె మార్పిడి చేసుకున్న వ్యాధి గ్రస్తులు
No comments:
Post a Comment