గ్రామ వార్డు సచివాలయాలు గడప వద్దకే పాలన - GOVERNMENT JOBS

Saturday, February 1, 2020

గ్రామ వార్డు సచివాలయాలు గడప వద్దకే పాలన

గ్రామ వార్డు సచివాలయాలు  గడప వద్దకే పాలన 

ఇక పెన్షన్ ,బియ్యం కార్డులు , ఆరోగ్యశ్రీ కార్డులు , ఇళ్ల పట్టాలు , కుల , ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సహా  541 సేవలు నిర్దిష్ట కాలవ్యవధిలో  అందుబాటులో ఉంటాయి . 
ఏ సేవలు  ఎంత సమయంలో 
సేవలు వివరాలు 
1. మ్యుటేషన్ ధ్రువీకరణ పత్రాలు ,ఇంటిపన్ను , ఆస్తి పన్ను , నీటి పన్ను కరెంట్ బిల్లు , వై ఎస్ ఆర్ భీమా క్లెయిమ్ నమోదు తదితర సేవలు , బియ్యం కార్డులో మార్పులు, జనన రిజిస్ట్రేషన్ ,మరణ రిజిస్ట్రేషన్ , వివాహ రిజిస్ట్రేషన్ , మత్సకార సొసైటీ రిజిస్ట్రేషన్ తదితర సేవలు . 
సేవల సంఖ్య :280    కాలపరిమితి :72గంటలు లో 
2. కొత్త బియ్యం కార్డు జారీ,  ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తదితర సేవలు 
సేవల సంఖ్య :6       కాలపరిమితి :5రోజులలో 
3. టైటిల్ డీడ్ CUM పాస్ బుక్ , ఆదాయ సర్టిఫికెట్ , జాబ్ కార్డు పేమెంట్ వివరాలు స్థానిక స్థితి దృవీకరణ పత్రం 
ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ 
మీటర్ టెస్టింగ్ 
విద్యుత్ కనెక్షన్ క్యాటగిరీలో మార్పు
తదితర సేవలు 
సేవల సంఖ్య :98    కాలపరిమితి :7రోజులలో  
4. ఎఫ్ -లైన్ దరఖాస్తు , గ్రామపటం ప్రతి 
సేవల సంఖ్య :2     కాలపరిమితి :10రోజులలో 
5. ఓబిసి సర్టిఫికెట్ 
   ఆర్ధికంగా బలహీన వర్గాల వారికీ ఆదాయం మరియు ఆస్తి సర్టిఫికెట్ జారీ ,
    ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ 
    ఆగిపోయిన విద్యుత్ మీటర్ల మార్పు 
    గృహ అవసరాల కోసం  LTవిద్యుత్ కనెక్షన్ తదితర సేవలు 
  సేవల సంఖ్య :57   కాలపరిమితి :30రోజులలో 

  • 30రోజుల పైబడిన కాలపరిమితి ఉన్న సేవలు చట్టం ద్వారా నిర్దేశిత కాలపరిమితి కి లోబడి అందించబడును 
  • సేవల వివరాల పట్టిక గ్రామవార్డు సచివాలయాల కార్యాలయంలో ప్రదర్శించబడును . 
No comments:

Post a Comment