Current Affairs Telugu December 8th 2019| Current Affairs Telugu December 2019
కాలుష్యకారక వ్యర్ధాలతో పోటాష్
కాలుష్య కారక నిర్మునలకు సి ఎస్ ఐ ఆర్ శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలించడం తో ఏటా 500 కోట్ల నుంచి 700 కోట్లు విలువైన పోటాష్ ఉత్పత్తి చేయవచ్చని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి ముండే వెల్లడించారు .
పారామిలటరీ జవాన్లకు ఖాదీ ఏకరూప దుస్తులు
పారామిలటరీ జవాన్లకు ఖాదీ యూనిఫామ్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది .
మహాత్మగాంధీ 150 వ జయంతి ఉత్సవాల సందర్బంగా ఈ నిర్ణయం తీసుకుంది .
70శాతం ఖాదీ 30 శాతం పాలిస్టర్ ఉండే పాలి ఖాదీ ఏకరూప దుస్తులను అందజేయనుంది .
Current Affairs Telugu December 8th 2019| Current Affairs Telugu December 2019
మహిళలకు సురక్ష
ఆరోగ్య పరంగా చూసినప్పుడు మహిళలకు కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి .
అలాంటి కొన్ని అనారోగ్యసమస్యల బారిన పడినప్పుడు ఆర్ధికంగా వారికీ అండగా నిలిచేలా హెచ్ డి ఎఫ్ సి ఏర్గో మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య భీమా పధకాన్ని తీసుకొచ్చింది.
మై హెల్త్ విమెన్ సురక్ష పేరుతో వచ్చిన ఈ పాలసీ లో మహిళలో వచ్చే వివిధ రకాలైన క్యాన్సర్లు శస్త్రచికిత్సలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్ర అనారోగ్యంలో పరిహారం ఇస్తుంది.
18-65 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు ఈ పాలసీని ఎంచుకోవచ్చు .
భారత్ లో పోషకాహార పంటలను పెంచాలి
భారత్ లో రైతులు వరి సాగు ను తగ్గించి ఎక్కువ పోషకాలున్న పర్యావరణ అనుకూల పంటలను సాగు చేస్తే దేశంలో ఆహార సరఫరా మెరుగుపడుతుందని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు .
జొన్నలు , రాగులు సజ్జలు , వంటివి సాగు చేయాలనీ కోరారు .
No comments:
Post a Comment