Current Affairs Telugu December 7th 2019 |Current Affairs Telugu December 2019
జాతీయస్థాయిలో వి ఐ టి కి రెండు అవార్డులు
అఖిల భారత స్థాయిలో విద్యాసంస్థలు పరిశుభ్రత స్వచ్ఛత కు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఏటా పురస్కారాలను అందచేస్తుందిదీనిలో భాగంగా ఈ ఏడాది స్వచ్ఛత అవార్డుతో పాటు పరిశుభ్రమైన ప్రాంగణం -2019 పురస్కారం వేలూరు విఐ టి కి దక్కింది.
Current Affairs Telugu December 7th 2019 |Current Affairs Telugu December 2019
హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఓ ఎస్డీగా పీవీ సింధు
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణికి పీవీ సింధు ను హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఓ ఎస్డీగా ప్రభుత్వం నియమించింది .
దిశ పేరు ఇలా వచ్చింది
ప్రతి గుండెను తాకుతున్న పేరు దిశ.ఆమె అత్యాచారానికి గురైందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి అసలు పేరు వాడరాదన్న సుప్రీమ్ ఆదేశాలను పోలీసులు పాటించారు .
హత్యచారానికి గురైన వైద్యురాలికి దిశ అనే పేరు పెట్టడం వెనుక భారీ కసరత్తు జరిగింది .
అలాంటిపేరున్న బాలిక , యువతీ , మహిళా , ఇలా ఎవరు ఉండకూడదని భావించారు .
తెలుగు ఉపాధ్యాయులు ,మీడియా ప్రతినిధులు నుంచి కూడా పేర్లు తీసుకున్నారు .
చివరకు దిశ అన్న పేరును ఖరారు చేసారు .
సైబర్ మిత్రకు కేంద్ర ప్రభుత్వం అవార్డు
ఆంధ్రప్రదేశ్ పొలిసు విభాగం తీసుకువచ్చిన సైబర్ మిత్ర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అవార్డును గెలుచుకుంది .కేంద్ర ఐ టి శాఖ ఆద్వర్యంలోని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు -2019 దక్కించుకుంది .
Current Affairs Telugu December 7th 2019 |Current Affairs Telugu December 2019
జనగణనకు ప్రత్యేక యాప్
కాగితంతోనే కాకుండా మొబైల్ ద్వారా కూడా జనగణన 2021వివరాలు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు .2020నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు .
కుటుంబ నియంత్రణ కోసం పురుషులు ఇక శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు .
ఇందుకోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఇంజక్షన్ సిద్దమైనది .ఈ మందును భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్తలు రూపొందించారు .
రివర్సిబుల్ ఇన్ హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ అనే ఇంజక్షన్ ను స్టైరిన్ మేలియాక్ ఆన్ హైడ్రిడ్ అనే పదార్ధంతో తయారు చేశారు .
ఇది 13 ఏళ్ళు పనిచేస్తుంది .
No comments:
Post a Comment