Current Affairs Telugu December 6th 2019 |Current Affairs Telugu December 2019
న్యాయ సేవాధికార సంస్థ ఈ సి గా జస్టిస్ రాకేష్ కుమార్
ఏపీ న్యాయ సేవాధి కార్యాసంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ నామినేట్ అయ్యారు . హైకోర్టు రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తి ఈ సి గా నామినేట్ కావడం సాంప్రదాయంగా వస్తుంది .పారిశ్రామిక వ్యర్ధాల పర్యవేక్షణకు కొత్త సంస్థ
పరిశ్రమల వ్యర్ధాల తరలింపు పర్యవేక్షణకు పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .Current Affairs Telugu December 6th 2019 |Current Affairs Telugu December 2019
అరేబియా లో పవన్ తుఫాన్
నైరుతి అరేబియా సముద్రం మీదుగా డిసెంబర్ 5 వతేది తుఫాన్ ఏర్పడింది .దీనికి శ్రీలంక దేశం ప్రతిపాదించిన పవన్ అను పేరు పెట్టారు .
అత్యాచారాల్లో దేశంలో ఉత్తరప్రదేశ్ లో అధికం
దేశ వ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాలపై నమోదైన కేసులు 3. 59 లక్షలు .ఉత్తరప్రదేశ్ లో నమోదైన కేసుల సంఖ్య 56,011 దేశంలోనే అత్యధికం .
ఆధారం : జాతీయ నేర రికార్డుల బ్యూరో 2017 నివేదిక వెల్లడించింది .
పురుషుల వన్డే కు రిఫరీగా లక్ష్మి
తెలుగు మహిళ మాజిక్రికెటర్ జి ఎస్ లక్ష్మి అరుదైన ఘనత సాధించింది .వన్డే మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన తొలి భారత మహిళగా ఆమె నిలువబోతుంది .
లక్ష్మి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి .
దీప్తికి స్వర్ణం
జాతీయ పాఠశాలల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ అథ్లెట్ దీప్తి మెరిసింది .పంజాబ్ లో జరిగిన అండర్ -17 బాలికల 100మీటర్ల పరుగులో ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది.
No comments:
Post a Comment