Current Affairs Telugu December 2nd 2019| Current Affairs Telugu 2019 December
చేతుల శుభ్రతతో కేరళ భేష్
చేతుల శుభ్రత విషయంలో దక్షిణాది రాష్ట్రాలలో కేరళ ఆదర్శంగా నిలుస్తుంది . ఆ తరువాత తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయి .
మరుగు దొడ్డికి వెళ్లొచ్చాక సబ్బు నీటితోనే చేతులు శుభ్రంగా చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ 54%
తెలంగాణ 73% కుటుంబాలు స్పష్టం చేశాయి .
కేంద్ర గణాంక ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది .
తొలి దేశముగా భారత్ హజ్ యాత్ర డిజిటలీకరణ
పవిత్ర హజ్ యాత్ర వివరాలన్నింటినీ పూర్తిగా డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన దేశం భారత్ అవతరించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు .
Current Affairs Telugu December 2nd 2019| Current Affairs Telugu 2019 December
2019 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్
2019ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ ను బ్రిటన్ రేసర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నారు .
లూయిస్ హామిల్టన్ ఎఫ్ 1 రేసులో ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం ఇది ఆరోసారి
ఆరోగ్యశ్రీ లబ్ది దారులకు విశ్రాంతి భత్యం
ఆరోగ్యశ్రీ పధకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న లబ్ధిదారులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వారు ఇంటివద్ద వుండి విశ్రాంతి తీసుకునే సమయంలో రోజువారీ భత్యం అందించి వారికీ భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .
ఈ పధకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 2 వతేది గుంటూరు లో ప్రారంభించారు .
రోగులు పూర్తిగా కోలుకునే వరకు రోజుకు 225 చొప్పున నెలకు గరిష్టంగా 5 వేలు అందించేలా ఈ పధకానికి రూపకల్పన చేశారు .
No comments:
Post a Comment