Current Affairs Telugu December 13th 2019| Current Affairs Telugu December 2019 - GOVERNMENT JOBS

Friday, December 13, 2019

Current Affairs Telugu December 13th 2019| Current Affairs Telugu December 2019

Current Affairs Telugu December 13th 2019| Current Affairs Telugu December 2019

గుజరాత్ అల్లర్లలో మోదికి క్లీన్ చిట్ 

గుజరాత్ అల్లర్లలో  అప్పటి ముఖ్యమంత్రి  నరేంద్రమోదీ  ఆద్వర్యంలోని  ప్రభుత్వం  ప్రమేయం  ఏమి లేదంటూ  జస్టిస్  నానావతి  కమిషన్  క్లీన్ చిట్  ఇచ్చింది . 

టైమ్ ఈ ఏటి మేటి గా గ్రెటా థెన్  బెర్గ్ 

వాతావరణ మార్పులపై చర్యలను డిమాండ్ చేస్తూ ప్రపంచ దేశాధినేతలనే  మీకెంత  ధైర్యం అంటూ  ప్రశ్నించిన  పర్యావరణ ఉద్యమ కారిణి  గ్రెటా థెన్  బెర్గ్ (16)  ను ఈ ఏటి  మేటి వ్యక్తిగా  టైమ్ మ్యాగజైన్  ప్రకటించింది . 
2019 వ సంవత్సరానికి  గాను  ఆమెను  ఈ గౌరవానికి  ఎంపిక చేసినట్లు  టైమ్  తెలిపింది . 
ఇప్పటి దాక  ఈ పురస్కారానికి  ఎంపికైన  అత్యంత  పిన్న వయస్కురాలు  గ్రెటా థెన్ బెర్గ్  అని పేర్కొంది . 

Current Affairs Telugu December 13th 2019| Current Affairs Telugu December 2019

కొత్త దేశముగా  భోగాన్ విల్ 

మరో కొత్త దేశంగా  ఆవిర్భవించనుంది  దీని పేరు భోగాన్ విల్ పపువా న్యూగినియా నుంచి ఈ దక్షిణ ఫసిఫిక్ ప్రాంతం స్వాతంత్ర సాధన దిశగా నిర్వహించిన రిఫరెండంలో ఘనా విజయం సాధించింది అంటూ  సంబంధిత కమిషనర్ చైర్మన్ బెర్టీ ఆహ్రేన్ ప్రకటించారు. 
భోగాన్ విల్  జనాభా  దాదాపు 3 లక్షలు. 

ఏపీ లో నిర్భయ నిధి వినియోగం  15 శాతమే 

మహిళల రక్షణ భద్రతకు  కేంద్రప్రభుత్వం  రాష్ట్రానికి  కేటాయించిన  నిర్భయ నిధి నుంచి  కేవలం 15 శాతమే  ఏపీ  ప్రభుత్వం ఖర్చు చేసిందని  కైలాష్ సత్యర్ధి  చిల్డ్రన్  ఫౌండేషన్  వెల్లడించింది .  
రాష్ట్రానికి  97. 84 కోట్లు  విడుదల  చేయగా  ఇందులో  14. 26కోట్లు వ్యయం చేసిందని పేర్కొంది . 

పి ఎస్ ఎల్ వి - సి 48 ప్రయోగం విజయవంతం 

అంతరిక్ష ప్రయోగాల్లో  మనదేశం మరో మారు తన సత్తా  చాటింది  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  పి ఎస్ ఎల్ వి -48 రాకెట్ ద్వారా 10ఉపగ్రహాలను  అంతరిక్షంలో  విజయవంతంగా  ప్రవేశపెట్టింది . 
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్  సిరీస్ లో ఇది 50 వ ప్రయోగం . 

విద్యుత్తు విమానం 

ప్రపంచంలో తొలిసారి పూర్తిస్థాయి  విద్యుత్తు  ఎలక్ట్రికల్ విమానమిది .  
కెనడా కు చెందిన మాగ్నిక్స్ సంస్థ  దీన్ని తయారు  చేసింది . 
ఇది వాంకోవర్ నుంచి బయలు దేరి  విజయ వంతంగా  సమీప దీవులు  చేరింది . 

పెరిగిన డెంగీ  కేసులు 

రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కంటే ఈ సంవత్సరం  డెంగీ జ్వరాల ప్రభావం పెరిగింది. 
విశాఖపట్నం, గుంటూరు జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 
వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 
రాష్ట్రంలో     2017లో -------4,925
                 2018లో -------3,972
                 2019లో ------4,931

డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం.


Current Affairs Telugu December 13th 2019| Current Affairs Telugu December 2019







No comments:

Post a Comment