Current Affairs Telugu December 10th 2019| Current Affairs Telugu December 2019
విశ్వసుందరి గా దక్షిణాఫ్రికా యువతీ
విశ్వసుందరి కిరీటం ఈ దఫా దక్షిణాఫ్రికా కు చెందిన జోజిబిని తుంజిని వరించింది .వివిధ దేశాలకు చెందిన 90 మంది అందగత్తెలను తల దన్ని జోజిబిని ఈ టైటిల్ ను సాధించారు .
జోజిబినికి మిస్ యూనివర్స్ 2019 కిరీటాన్ని గత ఏడాది ఇదే టైటిల్ సాధించిన ఫిలిప్పీన్స్ అందాల సుందరి
కేటీరియోనో గ్రే అలంకరించారు .
మొదటి రన్నరప్ గా మిస్ ప్యూర్టోరిక సుందరి మాడిసన్ అండర్సన్
రెండో రన్నరప్ గా మెక్సికో కు చెందిన అందగత్తె యాప్లె అల్విడ్రేజ్ లు నిలిచారు .
టోక్యో ఒలింపిక్స్ నుంచి రష్యా అవుట్
టోక్యో 2020ఒలింపిక్స్ సహా నాలుగేళ్ళ పాటు ఎలాంటి ప్రధాన అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొనకుండా రష్యా ప్రపంచ డోపింగ్ నిరోధ సంస్థ నిషేధం విధించింది .2022ఫుట్ బాల్ ప్రపంచ లోను రష్యా పోటీ పడలేదు .
దీనికికారణం : డోప్ పరీక్షల్లో పట్టుబడ్డ అథ్లెట్లు ను కాపాడేందుకు తప్పుడు వివరాలు ఇచ్చినందుకు రష్యాను వాడా శిక్షించింది .
Current Affairs Telugu December 10th 2019| Current Affairs Telugu December 2019
ఎస్ ఐ పి బి చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహిక బోర్డును పునర్నిర్మాణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .ఎస్ ఐ పి బి చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తారు .
34ఏళ్లకు ఫిన్లాండ్ ప్రధాన పదవి
రికార్డు సృష్టించిన సనమరిన్.ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా ఫిన్లాండ్ కు చెందిన సనా మారిన్ ప్రత్యేకత సాధించనున్నారు .
34ఏళ్ళ సనా మారిన్ ఫిన్లాండ్ లో 5 పార్టీల సంకీర్ణ సర్కారుకు సారధ్యం వహిస్తారు .
ఈ దేశ ప్రధానిగా భాద్యతలు నిర్వహించనున్న మూడో మహిళా సనా మారిన్ అవుతారు .
మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 129 వ ర్యాంక్
మానవాభివృద్ధి సూచీలో భారత్ స్థానం కాస్త మెరుగుపడింది . మొత్తం 189 దేశాలలో గత ఏడాది 130వ స్థానం సంపాధించగా ఈ ఏడాది అంటే 2019 లో భారత్ స్థానం 129 వస్థానం సంపాదించింది .ఐక్యరాజసమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది .
సైనిక పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు
దేశంలో ని మొత్తం 31 సైనిక పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది .సైనిక పాఠశాలలో బాలికలకు 10 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తామన్నారు .
No comments:
Post a Comment