Current Affairs Telugu 21st December 2019|Current Affairs Telugu December 2019
రాజధాని నిపుణుల కమిటీ సభ్యుల నేపధ్యం
రాజధాని అమరావతి తో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఫై ప్రభుత్వానికి సిఫారసులు చేసిన కమిటీలో ప్రణాళిక ఆర్కిటెక్క్చర్ రంగాల నిపుణులున్నారు . వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు1. జి . ఎన్ . రావు( విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి ) నిపుణుల కమిటీకి కన్వీనర్ గా వ్యవహరించారు .
2. ప్రొఫెసర్ . కె . టి . రవీంద్రన్: ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అర్బన్ డిజైనింగ్ విభాగానికి ప్రొఫెసర్ గా డీన్ గా వ్యవహరించి పదవి విరమణ చేశారు
3. ప్రొఫెసర్ శివానంద్ : పట్టణ ప్రాంత రవాణా రంగానికి చెందిన అంశాల్లో నిపుణులు
4. ప్రొఫెసర్ మహావీర్ :
5. డాక్టర్ అంజలి మోహన్
6. కె . బి . అరుణాచలం
7. సుబ్బారావు
లామోత్రిజిన్ మందులపై హెచ్చరిక
మూర్ఛ మానసిక వ్యాధులకు ఉపయోగించే లామోత్రిజీన్ మాత్రలు తాయారు చేసే ఔషధ తయారీ సంస్థలు మాత్రలు వాడటం వల్ల కలిగే ప్రభావాలను మందుల హెచ్చరికలు ముద్రించాలని ఏపీ ఔషధ నియంత్రణ పరిపాలన సంస్థ ఆదేశించింది .భారతీయ అమెరికన్ కు ట్రంప్ సర్కారులో కీలక పదవి
భారతీయ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాధన్ ను ప్రతిష్టాత్మక మైన జాతీయ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ పదవికి ఎంపిక చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు .Current Affairs Telugu 21st December 2019|Current Affairs Telugu December 2019
మారిటైమ్ కార్పొరేషన్ సి ఏం డి గా కారికలా వలవన్
ఏపీ మారిటైమ్ మౌలిక వసతుల సదుపాయాల సంస్థ సి ఏం డి గా బి సి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కారికలా వలావన్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణలో ఏపీ టాప్
ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం నిలిచినట్లు కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది .ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయిబాబా సెంట్రల్ స్కూల్ విద్యార్థి ఆర్ . తేజస్విని అందరిని మంత్ర ముగ్దులను చేసినట్లు కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది .
No comments:
Post a Comment