Current Affairs Telugu 19th December 2019| Current Affairs Telugu December 2019
బండినారాయణస్వామి కి కేంద్ర సాహిత్య పురస్కారం
ప్రసిద్ధ తెలుగు రచయిత బండినారాయణస్వామి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది .రాయలసీమ జీవితాలపై రచించిన శప్త భూమి నవల 2019 కి గాను ఈ అవార్డు లభించింది .
అలాగే మరో తెలుగు ప్రముఖుడు పెన్నా మధుసూదన్ కావ్యం ప్రజ్ఞా చక్షుసం సంస్కృత విభాగంలో పురస్కారానికి ఎంపికయ్యంది.
లాం ఏరువాక కేంద్రానికీ ఉత్తమ అవార్డు
రైతుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించిన గుంటూరు (లాం )ఏరువాక కేంద్రానికి 2018-2019 సంవత్సరానికి ఉత్తమ అవార్డు లభించింది .సాగు ఖర్చులు తగ్గిస్తూ నాణ్యమైన ఉత్పత్తిని సాధించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు 13 ఏరువాక కేంద్రాలలో లాం ఏరువాక కేంద్రాన్ని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ అవార్డుకు ఎంపిక చేసింది .
లాటరీపై 28%పన్ను
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన సమావేశమై జి ఎస్ టి మండలి కీలక నిర్ణయం తీసుకుంది .లాటరీపై ఏకరీతి పన్ను విధానాన్ని అమలు చేయనుంది .
No comments:
Post a Comment