Current Affairs Telugu 17th December 2019|Current Affairs Telugu December 2019
కొత్త సైన్యాధిపతి గా ముకుంద్ నరవాణే
భారత తదుపరి సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఎంపికైనట్లు అధికార వర్గాలు తెలిపారు .ప్రస్తుతం సైనిక ఉపాధ్యక్షుడిగా ఉన్నారు . అత్యున్నత స్థాయిలో ఆయన నియామకానికి సమ్మతి లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు .
సీనియారిటీ ప్రకారం ఎంపిక చేశారు .
రాష్ట్రానికి జి ఎస్ టి పరిహారం 925 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనల నేపథ్యంలో జి ఎస్ టి ద్వారా పన్ను నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం క్రింద కేంద్రం 35,398కోట్లు విడుదల చేసింది .ఇందులో రాష్ట్రానికి 925 కోట్లు దక్కింది.
2019 ఆగష్టు సెప్టెంబర్ నెలలో ఏర్పడిన నష్టానికి పరిహారంగా ఈ మొత్తాన్ని ఇచ్చింది.
Current Affairs Telugu 17th December 2019|Current Affairs Telugu December 2019
అతిపెద్ద దేశీయ కంపెనీ గా అవతరణ
ముకేశ్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత సాధించింది. గత ఆర్ధిక సంవత్సరం (2018-2019)లో 5. 81లక్షల కోట్లు ఆదాయంతో భారత్ లో అతిపెద్ద కంపెనీ గా అవతరించింది .ఫార్చూన్ ఇండియా 500జాబితా ప్రకారం పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను వెనక్కి నెట్టింది . ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ రంగ సంస్థ గా నిలిచింది .
ఆరున్నర నెలలో 67 మంది రైతులు ఆత్మ హత్య
రాష్ట్రంలో జూన్ 1 నుంచి 67 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు .అనంతపురం, శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం జిల్లాలో రైతు ఆత్మ హత్య లే నమోదు కాలేదు .
గుంటూరు జిల్లాలో అత్యధికంగా నమోదు --13
ప్రకాశం --12
కడప ----10
చిత్తూర్ ---11
పశ్చిమ గోదావరి ---8
నెల్లూరు ----6
తూర్పుగోదావరి --3
కృష్ణ -----3
కర్నూల్ -----1
No comments:
Post a Comment