FAT SOLUBLE VITAMINS | కొవ్వులొ కరిగే విటమిన్స్
విటమిన్లు
సర్ హెచ్ జి హాప్ కిన్స్ అనే శాస్త్ర వేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగుదల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్ధాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు.
విటమిన్స్ అనే పేరు పెట్టిన వ్యక్తి; కాసిమర్ ఫంక్ (1912)
విటల్ అమైన్స్ అనే పదం నుంచి విటమిన్లు అనే పదం వచ్చింది.
1915లో మేక్ కల్లమ్ విటమిన్లను కొవ్వులో కరిగే ఆధారంగా నీటిలో కరిగే ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు.
కొవ్వులొ కరిగే విటమిన్లు; ఏ డి ఇ కె
నీటిలో కరిగే విటమిన్లు; బి సి
FAT SOLUBLE VITAMINS | కొవ్వులొ కరిగే విటమిన్స్
కొవ్వులొ కరిగే విటమిన్లు
ఏ విటమిన్ రసాయనామం రెటినాల్
ఏ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు రేచీకటి, గ్జిరొప్తాల్మియా,శుక్ల పటలం (కార్నియా ) చర్మం గరుకుగా మారడం పొలుసులుగా ఊడిపోవడం.
లభించే పదార్దాలు; పాలు, గుడ్డు, వెన్న, కారేట్, తోటకూర, గుమ్మడి, మునగ,
ఏ విటమిన్ ను కనుగొన్నది ; మెక్ కల్లం మరియు డేవిస్
A విటమిన్ అధికంగా గల పదార్థం ;క్యారెట్
A విటమిన్ అధికంగా గల ఆకుకూర ; బచ్చలి
A విటమిన్ అధికంగా గల ఫలం ; బొప్పాయి
కంటిచూపుకు తోడ్పడే విటమిన్ ; A విటమిన్
పామొయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణమయ్యే విటమిన్ ; A విటమిన్
క్యారెట్ ఆరంజ్ రంగులో ఉండటానికి కారణమయ్యే విటమిన్ ; A విటమిన్
FAT SOLUBLE VITAMINS | కొవ్వులొ కరిగే విటమిన్స్
D విటమిన్ రసాయణనామం కాల్సి ఫెరాల్
సన్ షైన్ విటమిన్ , ఫ్రీవిటమిన్ ,యాంటీ రికెటింగ్ విటమిన్ ,డి విటమిన్ ను ఈ విధంగా కూడా పిలుస్తారు .
D విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు రికెట్స్ (చిన్న పిల్లలో)ఎముకలు పెళుసుగా అవడం
D విటమిన్ లభించే పదార్దాలు ; ,సూర్యకాంతి ,గుడ్డు,వెన్న ,కాడ్ లివర్ ఆయిల్ ,,పాలు,. .
E విటమిన్ రసాయననామం టోకోఫెరల్
యాంటీ స్టెరిలిటీ విటమిన్ ,బ్యూటీ విటమిన్ , వంధత్వనిరోధక విటమిన్ . E విటమిన్ కు మరియొక పేర్లు.
E విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు : పురుషులలో వంధత్వం, స్త్రీల లో గర్భ స్రావం , ఎర్ర రక్తకణాల జీవితకాలం తగ్గడం ,కండరాల క్షిణత.
E విటమిన్ లభించే పదార్దాలు : కాయగూరలు మొలకెత్తు గింజలు ,మాంసం, పొద్దుతిరుగుడు గింజల నూనె పట్టి గింజల నూనె ,తాజా ఫలాలు .
FAT SOLUBLE VITAMINS | కొవ్వులొ కరిగే విటమిన్స్
K విటమిన్ రసాయనామం ఫీల్లోక్వినోన్
K విటమిన్ ను యాంటీ బ్లీడింగ్ విటమిన్ రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అని కూడా అంటారు .
K విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు :గాయాలైనప్పుడు ఆగని రక్త స్రావం ,రక్తం గడ్డ కట్టక పోవడం.
K విటమిన్ లభించే పదార్దాలు : గుడ్లు ,కాలేయం ,ఆవు పాలు ,ఆకుకూర ,క్యాలి ఫ్లవర్ ,
K విటమిన్ ను కనుగొన్న వ్యక్తి ; డాయీసి డాం .
No comments:
Post a Comment