Current Affairs Telugu November 9th 2019| Telugu Current Affairs November
భారత్ లో 2023 హాకీ ప్రపంచ కప్పురుషుల హాకీ ప్రపంచ కప్ కు వరుసగా రెండో సారి భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. 2023 జనవరి 13 నుంచి 29 వరకు భారత్ లో ప్రపంచకప్ జరుగుతుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించింది.
2022 మహిళల ప్రపంచకప్ నిర్వహణ బాధ్యత ను స్పెయిన్ నెదర్లాండ్స్ కు ఉమ్మడిగా అప్పగించింది.
గతంలో భారత్ 1982 ముంబై 2010ఢిల్లీ ,2018భువనేశ్వర్, నెదర్లాండ్స్ మూడేసి సార్లు పురుషుల ప్రపంచ కప్ కు ఆతిధ్యమిచ్చాయి .
2023టోర్నీ తరువాత ప్రపంచకప్ ను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
Current Affairs Telugu November 9th 2019| Telugu Current Affairs November
సిక్సర్ల శర్మ
వన్డేలో అత్యధిక సిక్సర్లు (232) బాదిన భారత ఆటగాడు రోహిత్ శర్మ
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆఫ్రిది (351) గేల్ (331) జయసూర్య (270)తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు (16)కొట్టిన రెండో ఆటగాడు ఇయాన్ మోర్యన్ (17)తొలి స్థానంలో ఉన్నాడు.
సందీప్ కు స్వర్ణం
ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో భారత అథ్లెట్ సందీప్ చౌదరి అదరగొట్టాడు.
జావెలిన్ త్రో (ఎఫ్ 44) విభాగంలో అతను జావెలిన్ ను 66.18 మీటర్ల దూరం విసిరి తనపేరిటే ఉన్న ప్రపంచ రికార్డు ను (65. 80మీటర్ల) అధిగమించాడు.
జావెలిన్ త్రో (ఎఫ్ 44) విభాగంలో అతను జావెలిన్ ను 66.18 మీటర్ల దూరం విసిరి తనపేరిటే ఉన్న ప్రపంచ రికార్డు ను (65. 80మీటర్ల) అధిగమించాడు.
ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఎఫ్ 44ఎఫ్ 64 ఈవెంట్లను ఒకే ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు.
కానీ ప్రపంచ రికార్డు లను కేటగిరీ ప్రకారం లెక్కిస్తారు.
Current Affairs Telugu November 9th 2019| Telugu Current Affairs November
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాధ్ దేవి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాధ్ దేవి రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాజ్య సభ భేటీలకు గుర్తుగా 250 రూపాయల వెండి నాణెం
రాజ్య సభ 250వ సమావేశాల ప్రారంభానికి గుర్తింపుగా కేంద్ర ఆర్ధిక శాఖ 250రూ వెండి నాణేన్ని విడుదల చేయనుంది. 99. 9% వెండితో దీన్ని రూపొందించింది దీని బరువు 40గ్రాములు ఉంటుంది. ఈ నెల 18 నుంచి రాజ్యసభ 250వ సమావేశాలు ప్రారంభం అవుతుంది.
Current Affairs Telugu November 9th 2019| Telugu Current Affairs November
సాయం స్వీకరణకు కనెక్ట్ టూ ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ లో పలు అభివృద్ధి సంక్షేమ పధకాల అమలుకోసం వివిధ వర్గాల నుంచి సాయాన్ని స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించినది. కనెక్ట్ టూ ఆంధ్ర పేరిట సిద్ధం చేసిన ఈ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఆవిష్కరించారు.
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మరో టోక్యో బెర్త్
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మధ్యప్రదేశ్ కు చెందిన 21ఏళ్ళ చింకి యాదవ్ ఫైనల్ కు చేరి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
No comments:
Post a Comment