Telugu Current Affairs November 2019
నవంబర్ 1 నుంచి వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీపేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యానికి శ్రీకారం చుడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగనేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పధకాన్ని పేదలందరికీ చేరువయ్యేలా నవరత్నాలలో వై ఎస్ జగన్ మాటిచ్చిన విధంగా పొరుగు రాష్ట్రాలలోని మహానగరాలైన హైదరాబాద్ ,బెంగళూర్ మద్రాస్ లో 130కి పైగా హాస్పిటల్స్ లో 716సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నవంబర్ 1 నుండి అమలుచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Telugu Current Affairs November 2019
యస్ వీ పశువైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులను నియామకంశ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులను ప్రభుత్వం నియమించింది.
భారత పశువైద్య పరిశోధన సంస్థ శాస్త్ర వేత్త సాయికుమార్ ,ఐ కార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ లను సభ్యులుగా నియమించింది.
అంగీకార్ కమిటీలో మార్పు
మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంగీకార్ కార్యక్రమ నిర్వహణ పర్యవేక్షణ కు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి ని సభ్యునిగా చేర్చింది.
Telugu Current Affairs November 2019
హాకీ ఇండియా చలో ఢిల్లీఒలింపిక్స్ కుఅర్హత సాధించిన భారత పురుషుల మహిళల హాకీ జట్లు
కొరియా జూనియర్ ఓపెన్ విజేత మైస్నం
భారత యువ షట్లర్ మైస్నం మేరా లువాంగ్ (మణిపూర్ )ఈ ఏడాది తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
ఈ ఏడాది ఇప్పటికే రష్యా జూనియర్ వైట్ నైట్స్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ టైటిల్స్ ను గెలుచుకున్నాడు.
అతను తాజాగా కొరియా జూనియర్ ఓపెన్ ను సొంతం చేసుకున్నాడు.
Telugu Current Affairs November 2019
అథ్లెటిక్స్ లో రెండు జాతీయ రికార్డులుఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో జరుగుతున్న 35వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పోటీలో అండర్ -16 బాలికల షాట్ ఫుట్ లో రెండు జాతీయ రికార్డులు నమోదయ్యాయి.
భారతి (హర్యానా )15.32మీటర్ల తో మొదటిస్థానం విధి (ఉత్తరప్రదేశ్) 14.40 మీటర్లతో రెండో స్థానం సాధించారు గత ఏడాది జాస్మిన్ కౌర్ 14.27 మీటర్లతో నెలకొల్పిన రికార్డును తిరగ రాసారు.
No comments:
Post a Comment