Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019 - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019

Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019

రోజుకు పని గంటలు  9 
కనీస వేతనాలకు  ఆరు ప్రమాణాలు జారీవేతన  కోడ్ ఫై  ప్రాధమిక నిబంధనలు జారీ.
దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే  వేతన జీవులు  కార్మికులు  కనీస  పని గంటలు మారనున్నాయి.
ఇప్పటి వరకు అమలులో ఉన్న 8 గంటలను 9 గంటలుగా మార్చనుంది.
వేతన కోడ్ -2019 అమలులో భాగంగా కనీస వేతనాలు కరువు భత్యం  పనిగంటలు తదితర  కార్మిక హక్కులకు సంబంధించి కేంద్రం నిబంధనలు  జారీ చేసింది.
కనీస వేతన ఖరారుకు  ఆరు ప్రమాణాలను నిర్ణయించింది.

కుటుంబానికి రోజుకు కనీసం 2700కేలరీల  ఆహరం 
ఒకకుటుంబంలో నలుగురు సభ్యులకు కలిపి (కార్మికుడు భార్య  ఇద్దరు పిల్లలు )రోజుకి 2700కేలరీల ఆహరం  ఏడాదికి 66 మీటర్ల  వస్త్రం ప్రామాణికంగా తీసుకోనుంది.
ఈ రెండింటికి అయ్యో ఖర్చులో 10శాతాన్ని ఇంటి అద్దె గా  20శాతాన్ని  ఇంధనం విద్యుత్తు   ఇతర ఖర్చుగా  లెక్కించనుంది.
కనీస వేతనంలో 25శాతం పిల్లల విద్య వైద్యం వినోదం  ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని నిబంధనలో కార్మిక శాఖ  పేర్కొంది.

Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019

ఇసుక అక్రమాలపై  టోల్ ఫ్రీ  నెంబర్ ప్రారంభం 
ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్ ఫోర్స్ చీఫ్ సురేంద్ర బాబును  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారు.
ఇసుక అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించేందుకు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14500  సీఎం 18 వతేది న   తాడేపల్లి లోని  క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

విజయవాడ లో వాయు కాలుష్యం 
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో వాయు కాలుష్యం పెరిగి పోతుందని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది.
భూమి కాలుష్య నియంత్రణ కు కూడా చర్యలు  చేపట్టాలని పేర్కొంది.
జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం పారిశ్రామిక  ప్రాంతాల్లో గాలి, నీరు, భూమి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని  కేంద్ర రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు  ఆదేశాలు జారీ చేసింది .
దేశ వ్యాప్తంగా 100 పారిశ్రామిక ప్రాంతాలు క్లస్టర్లలో తనిఖీలు చేసి అత్యంత కాలుష్య ప్రభావిత ప్రాంతాల జాబితాను విడుదల చేసింది.
కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ సరాసరి 68.04 పాయింట్లతో దేశంలో 45వ స్థానంలో విశాఖపట్నం సరాసరి 44.74 పాయింట్లతో 96వ  స్థానంలో ఉన్నాయి.
50-60పాయింట్స్ వస్తే తీవ్రంగా పరిగణించాలి 60 దాటితే పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లని సమగ్ర పర్యావరణ సూచి తెలిపింది.

Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019

మార్షల్స్  కొత్త అవతారం  
రాజ్యసభ 250వ సమావేశం  సందర్బంగా నవంబర్ 18నుంచి ఆ సభ మార్షల్స్ కి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి తెచ్చారు.
మార్షల్స్ ఇదివరకు సఫారీ దుస్తులు తల పాగాతో  కనిపించేవారు
 ఆధునిక రూపంతో పాటు నేటి అవసరాలకు తగ్గట్టు దాన్ని మార్చాలని మార్షల్స్ కోరారు.
దింతో రాజ్యసభ చైర్మన్  వెంకయ్య నాయుడు పలుదఫాలు చర్చించి  అనంతరం వారికీ సైనిక అధికారుల నూతన డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చారు.
గంగను కలుషితం చేసినందుకు  280కోట్లు  జరిమానా 
గంగా నదిని  కలుషితం చేస్తున్నందుకు 22తోలు శుద్ధి పరిశ్రమలకు 280కోట్లు జరిమానా విధిస్తు జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి  10 కోట్లు జరిమానా విధించింది ఎన్ జి టి  చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్  గోయెల్  ఆద్వర్యంలోని  ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019

అగ్రవాన్ గా మారనున్న ఆగ్రా 
ఆగ్రా పేరును అగ్రవాన్ గా మార్చాలని ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం  భావిస్తుంది.
ఈనగర పుట్టు పూర్వోత్తరాలు పరిశోధన చేయాలనీ డాక్టర్ బి ఆర్  అంబెడ్కర్  విశ్వవిద్యాలయం కోరింది .  

 

Current Affairs Telugu November 19th 2019| Telugu Current Affairs November 2019


No comments:

Post a Comment