Current Affairs Telugu 21th November 2019 |Current Affairs Telugu November 2019
ఫార్చూన్ అత్యుత్తమ వ్యాపార వేత్తలో సత్య నాదెళ్ల నెంబర్ వన్
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కు అరుదైన గౌరవం దక్కింది .ఫార్చూన్ వెల్లడించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2019జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు . మాస్టర్ కార్డు సీఈఓ అజయ్ బంగా 8 వ స్థానం.
అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాల్ 18 వ స్థానం ఈ జాబితాలో స్థానం సంపాదించారు .
సత్య నాదెళ్లతో పాటు వీరిద్దరూ భారత సంతతికి చెందిన వ్యక్తులు కావడం విశేషం .
ధ్రువ లిపికి ప్రపంచ గుర్తింపు
ఆంధ్ర వర్శిటీ ఆంగ్ల విభాగం ఆచార్యులు ప్రసన్నశ్రీ పదేళ్లు కష్టపడి రూపొందించిన లిపిని బ్రిటన్ కేంద్రంగా ఉన్న వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్ సంస్థ గుర్తిస్తూ లేఖ పంపింది.
ఛత్తీస్ ఘడ్ ధ్రువ జాతి గిరిజనుల భాషకు లిపి లేకపోవడంతో ఆచార్య ప్రసన్నశ్రీ 15అచ్చులు 27హల్లులు తో మొత్తం 42 అక్షరాలను రూపొందిచారు.
ధ్రువ జాతి గిరిజనుల భాష సంస్కృతి సంప్రదాయాలను తయారుచేసిన ఆ లిపికి తాజా గుర్తింపు తో అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చినట్లయింది . గతంలో ఆమె 18 గిరిజన భాషలకు లిపి రూపొందించారు.
Current Affairs Telugu 21th November 2019 |Current Affairs Telugu November 2019
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాలు నవంబర్ 20వ తేదీ గోవా లో ప్రారంభమయ్యాయి .
కేంద్ర సమాచార శాఖ, ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ,సినీ ప్రముఖులు అమితాబచ్చన్ రజనీకాంత్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు . ఈ వేడుకలో రజనీకాంత్ కు గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి పురస్కారాన్ని ప్రకాష్ జావదేకర్ ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా ప్రధానం చేశారు .
వధువునకు 10 గ్రాముల బంగారం అసోమ్ ప్రభుత్వం నిర్ణయం .
నూతన వధువులకు పది గ్రాముల బంగారం ఇస్తామని అసోం ప్రభుత్వం ప్రకటించింది .
అయితే వధువులు కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలని వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని షరతులు పెట్టింది . వధువుకు కచ్చితంగా చట్టపరమైన వివాహ వయస్సు వచ్చిఉండలి .
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే ఈ పధకానికి అరుంధతి స్వర్ణ పథకమని పేరు పెట్టారు .
శ్రీలంక ప్రధానిగా మహీంద్రా రాజపక్స
శ్రీలంక ప్రధానిగా మహీంద్రా రాజపక్స కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు గోట బాయ్ రాజపక్స ప్రకటించాడు గోటబాయకు మహీంద్రా సోదరుడు ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే తన పదవికి రాజీనామా సమర్పించాడు .
Current Affairs Telugu 21th November 2019 |Current Affairs Telugu November 2019
షింజో అబే రికార్డు
2,887రోజుల పదవి కాలం పూర్తి జపాన్ చరిత్రలో సుదీర్ఘకాలం సేవలు అందించిన ప్రధానిగా షింజో అబే నిలిచిపోనున్నారు .
ఆయనప్రధానిగా స్వీకరించి నవంబర్ 20 వతేదీకి 2,887రోజులు పూర్తయింది .
గత ప్రధాని తారో కట్సురా రికార్డును అబే అధిగమించారు. తారో కట్సురా 1901-1913 మధ్య మూడు సార్లు ప్రధానిగా చేపట్టారు .
త్వరలోనే త్రిధాధిపతి
భారత రక్షణ రంగంలో కీలక సంస్కరణకు రంగం సిద్ధమైంది . త్రివిధ ధళాలైన సైన్యం నౌకాదళం వాయు సేనలకు ఉమ్మడిగా రక్షణ బలగాల అధిపతి వచ్చే ఏడాది జనవరి కల్లా తొలిసారిగా నియమితులు కానున్నారు .
No comments:
Post a Comment