Current Affairs Telugu 16th November 2019|Telugu Current Affairs November - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 16th November 2019|Telugu Current Affairs November

Current Affairs Telugu 16th November 2019|Telugu Current Affairs November

వైద్యులపై దాడి చేస్తే  10ఏళ్ళ  వరకు జైలు  
విధుల్లో ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది ఫై  దాడులకు పాల్పడిన వారికీ పదేళ్ల వరకు  జైలు శిక్ష విధించేలా  చట్టం తీసుకు వచ్చేందుకు  కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. 
శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ను ప్రవేశ పెట్టనున్నట్లు  అధికారులు తెలిపారు.
వైద్యులు సిబ్బందిని  తీవ్రంగా గాయపరిచిన వారికీ 3నుంచి 10ఏళ్లపాటు  జైలు శిక్ష 2లక్షల నుంచి 10లక్షల  వరకు జరిమానా విధించాలని  ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు .

5జి కోసం 26-గిగా హెర్జ్ స్పెక్ట్రమ్ వద్దు - భారత్ 
5జి నెట్ వర్క్ కోసం 26-గిగా స్పెక్ట్రమ్ ను వినియోగించే అంశాన్ని  భారత్ వ్యతిరేకించింది.
ఇప్పటికే ఈ ప్రతిపాదనను జపాన్ ,రష్యా  చైనాలు , వ్యతిరేకించాయి
ఉపగ్రహ సేవలకు ఈ స్పెక్ట్రమ్ కావాలని  ఇస్రో  కోరింది .

Current Affairs Telugu 16th November 2019|Telugu Current Affairs November

భారత్ లో న్యూమోనియా  మరణాలెక్కువ -ఐక్యరాజ్యసమితి 
ప్రపంచం మొత్తం మీద 2018లో న్యూమోనియా తో మరణించిన 5ఏళ్లలోపు  చిన్నారుల సంఖ్య  విషయంలో భారత్  రెండవస్థానంలో  ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి  తాజా నివేదిక పేర్కొంది .

ఇంటింటికి త్రాగునీటి కి ఇజ్రాయెల్ చేయూత 
భారత్ లోని ప్రతి ఇంటికి 2024నాటికల్లా నీటి సౌకర్యం కల్పించే అంశంపై ఇజ్రాయెల్ సహకారాన్ని కేంద్రం తీసుకోనుంది. 
ఇందులో భాగంగా భారత జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేఖావత్  నవంబర్ 17 నుంచి పర్యటించనున్నారు. 

Current Affairs Telugu 16th November 2019|Telugu Current Affairs November


No comments:

Post a Comment