Current Affairs Telugu 15th November 2019|Telugu Current Affairs November
ఉత్తమ లఘు చిత్రంగా కుంభిల్ శివమానవహక్కుల రక్షణ ప్రచారానికి సంబంధించిన అవగాహనను సృజనాత్మకంగా తెలియ జెప్పే లఘు చిత్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం పురస్కారాలు ప్రకటించింది.
2019 వ సంవత్సరానికి మొత్తం 88లఘు చిత్రాలు పోటీ పడగ వీటిలో మూడింటిని ఎంపిక చేసింది.
అత్యాచారానికి గురైన బాలుడు అతని కుటుంబం న్యాయం పొందేందుకు చేసే ప్రయత్నం ఇతి వృత్తంగా తీసిన కుంభీల్ శివ తొలి ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది.
మోదీ సర్కార్కు క్లీన్ చీట్ రఫెల్ రివ్యూ పిటిషన్ కొట్టి వేత్త
రఫెల్ ఒప్పందంపై దర్యాప్తునకు నిరాకరిస్తూ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ను సమీక్షించాలని దాఖలైన పిటిషనర్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
ఈ కేసులోని వాదనలు FIR నమోదుకు తగ్గట్లు ఉన్నాయని భావించడం లేదని పేర్కొంది . తద్వారా నరేంద్రమోదీ సర్కార్కు క్లీన్ చిట్ ఇచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ కె ఏం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం నవంబర్ 14 న తీర్పు ఇచ్చింది.
Current Affairs Telugu 15th November 2019|Telugu Current Affairs November
పొగాకు బోర్డుకు అంతర్జాతీయ అవార్డువర్జీనియా పొగాకు సాగులో సుస్థిర కార్యక్రమాలను కృషి చేసిన పొగాకు బోర్డుకు ప్రతిష్టాత్మక గోల్డెన్ లీప్ అవార్డు లభించింది.
నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో నిర్వ హించిన టాబ్ ఎక్సపో -2019లో బోర్డు డైరెక్టర్ సునీత అవార్డు అందుకున్నారు.
పొగాకు పరిశ్రమలో ఉత్తమ ప్రదర్శన కనబరచిన సంస్థలకు టుబాకో రిపోర్టర్ అనే అంతర్జాతీయ మ్యాగజిన్ 2006నుంచి ఏటా అవార్డులు అందిస్తారు.
సంధ్యకు చెస్ టైటిల్
అంతర్జాతీయ చెస్ లో తెలుగు క్రిడా కారిణిగా గోలి సంధ్య సత్తా చాటింది . ఖాట్మండ్ లో జరిగిన ఆసియా అమెచ్యూర్ చెస్ ఛాంపియన్ షిప్ మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది విజయవాడకు చెందిన సంధ్య 9 రౌండ్ల నుంచి ఆరు పాయింట్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
No comments:
Post a Comment