Current Affairs Telugu 14th November 2019|Telugu Current Affairs November
సుప్రీమ్ తో సహా ప్రధాన న్యాయ మూర్తి కార్యాలయము ఆర్ టి ఐ పరిధిలోకిభారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ప్రజా అధికార సంస్థ అని దానికి సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది .
ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5గురు సభ్యుల ధర్మసం 13వతేది నవంబర్ న ఈ మేరకు కీలక తీర్పు నిచ్చింది .
ఈ తీర్పును 1. జస్టిస్ .రంజన్ గొగోయ్
2.ఎన్ . వి . రమణ
3. డి .వై . చంద్రచూడ్
4. దీపక్ గుప్తా
5. సంజీవ్ ఖన్నా
చీఫ్ జస్టిస్ తో పాటు జస్టిస్ దీపక్ గుప్తా సంజీవ్ ఖన్నా కలిసి ఒక తీర్పు రాసారు. దీనిని ఏకీభవిస్తున్న జస్టిస్ ఎన్.వి రమణ డి.వై.చంద్రచూడ్ విడి విడి తీర్పులు వెలువరించారు. చీఫ్ జస్టిస్ కార్యాలయంలో ఆర్ టి ఐ పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు 2010 జనవరి 10న సమర్ధించింది.
Current Affairs Telugu 14th November 2019|Telugu Current Affairs November
బొడ్డు తాడును వెంటనే కత్తిరించొద్దురాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనా 5 నుంచి 10 నిముషాలు ఆగితే ఎంతో మేలు తల్లి ప్రసవించిన వెంటనే నవజాత శిశువు బొడ్డుతాడును కత్తిరించొద్దని కనీసం 5 నుంచి 15 నిముషాల వ్యవధినివ్వాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లకు కేంద్రం సూచనలు చేసింది.
బొడ్డుతాడును కాసేపు ఉంచేస్తే పుట్టిన 5 నిమిషాల్లోనే నవజాత శిశువు అదనంగా మరో 60 శాతం ఎర్రరక్తకణాలను పొందగలుగుతుంది. అందుకే బొడ్డుతాడు తొలగింపునకు ఈ మాత్రం వ్యవధినివ్వాలి.
ఇప్పటికే గుజరాత్, పశ్చిమబెంగాల్ లోని, ఆసుపత్రులలో ఈ విధానాన్ని పాటిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
షార్ కు చేరిన కార్పోషాట్ -3 ఉపగ్రహం
నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కు కార్టోషాట్-3ఉపగ్రహం చేరింది.
దీన్ని బెంగళూరులోని యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో తయారు చేసారు.
దీనిని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి 47వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు.
Current Affairs Telugu 14th November 2019|Telugu Current Affairs November
మన బడి నాడు -నేడుఒంగోలు లో ప్రారంభించనున్న సీఎం జగన్.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని నవంబర్ 14వతేది ఒంగోలు లో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రారంభించనున్నారు .
రాష్ట్రము లో మొదటి సారిగ తల్లిదండ్రుల కమిటీలతో దమాజిక కాంట్రాక్టు విధానంలో పాఠశాలలో 9 రకాల పనులు చేపడుతున్నారు .
1. నీటిసదుపాయాలతోకూడిన మరుగు దొడ్లు
2. విద్యుదీకరణతో పాటు ఫాన్స్ లైట్స్
3. తాగునీటి సదుపాయం
4. విద్యార్థులు పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్
5. పాఠశాలకు రంగులు
6. మరమ్మత్తులు
7. గ్రీన్ చాక్ బోర్డులు
8. అదనపు తరగతి గదులు
9. ప్రహరీ నిర్మాణం
ఏపీ సి ఎస్ గా నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు.
1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిని అయిన ఆమెను సి ఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
నవ్యంధ్ర ప్రదెశ్ లో తొలి మహిళగా బాధ్యతలు చేపట్టారు.
No comments:
Post a Comment