దక్షిణ మధ్య రైల్వే కు 53 వసంతాలు
- దేశంలోనే ఆదాయపరంగా ప్రముఖ జోన్ అయిన దక్షిణ మధ్య రైల్వే బుధవారంతో 53 వసంతాలు పూర్తిచేసుకోనుంది . సికింద్రాబాద్ కేంద్రంగా ఈ జోన్ ను 1966 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీని వార్షిక ఆదాయం 15640 కోట్లు.
గ్రామస్వరాజ్యానికి నేడు అంకురార్పణ
- తూర్పు గోదావరి జిల్లా లోని కరప గ్రామంలోని గ్రామసచివాలయాన్ని CM వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు.
Current Affairs Telugu October 2nd 2019| October Current Affairs Telugu
అంగారకుడిపై నమో వెంకటేశా
- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతి --- ఖండాంతరాలకు విస్తరించనుంది.
- అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ , నాసా అంగారక గ్రహం పైకి పంపించే రోవర్ పై శ్రీవారి పేరు లిఖితం కానుంది.
- 2021 ఫిబ్రవరి లో ఈ రోవర్ అంగారకుడిపై ల్యాండ్ కానుంది . ఈ అంగారక గ్రహం పై జీవ జాలం వాతావరణ పరిస్థితులపై ఇది అధ్యయనం చేయనుంది.
గోదావరి డెల్టాలో గాంధీజీ పర్యటనకు 90 ఏళ్ళు
- గోదావరి డెల్టాలో గాంధీజీ పర్యటించి 90 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో గాంధీజీ బోట్ క్యారీడ్ ప్రత్యేక పోస్టల్ కవర్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం MP అనురాధ ఆవిష్కరించారు.
AP విద్యాసంస్థలకు ర్యాంకుల పంట
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మంగళవారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ క్రింద ప్రకటించిన జాతీయ స్థాయి ర్యాంకులలో 35 రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలు దక్కించుకున్నాయి.
Current Affairs Telugu October 2nd 2019| October Current Affairs Telugu
T 20 సిరీస్ గెలిచినా భారత అమ్మాయిలు
- భారత్ 51 పరుగుల తేడాతో దక్షిణ ఆఫ్రికా మహిళల జట్టు పై విజయం సాధించింది భారత మహిళలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 5 ODI సిరీస్ 2-0 తో కైవసం చేసుకున్నాయి.
అంతరిక్ష వారోత్సవాలు
- అంతరిక్ష కార్యక్రమాలను సామాన్యుల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించనున్నారు.
- ఇందులో భాగంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ ) ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాలలో వారోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
తాడేపల్లి పురపాలికకు ప్రధమ శ్రేణి స్థాయి
- గుంటూరు జిల్లా లోని తాడే పల్లి పురపాలక సంఘానికి ప్రధమ శ్రేణి స్థాయి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి 70 వసంతాలు పూర్తి
- చైనా లో కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఘనంగా వేడుకలు జరిగాయి.
కోటి వెలుగులలో 28. 88 లక్షలు ఆంధ్ర ప్రదేశ్ వి
- దేశ వ్యాప్తంగా కోటి స్మార్ట్ LED వీధీ దీపాలను అమర్చితే అందులో 28. 88 లక్షలు ఆంధ్ర ప్రదేశ్ వి కావడం విశేషం.
- కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి RK సింగ్ ప్రశంసించారు. కోటి LED విధి దీపాలను జాతికి అంకితం చేసే కార్య క్రమాన్ని మంగళవారం ఢిల్లీ లో నిర్వహించారు.
- LED వీధి దీపాలతో దేశ వ్యాప్తంగా
- ఆంధ్ర ప్రదేశ్ ప్రధమ స్థానం 28. 88 లక్షలు
- రాజస్థాన్ ద్వితీయ స్థానం 10. లక్షలు
- ఉత్తర ప్రదేశ్ తృతీయ స్థానం 9. 30 లక్షలు
Current Affairs Telugu October 2nd 2019| October Current Affairs Telugu
MCC అధ్యక్షుడిగా సంగక్కర
- మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర బాధ్యతలు చేపట్టాడు.
- MCC అధినేతగా ఎంపిక అయిన తొలి బ్రిటిషేతర వ్యక్తి సంగక్కర. ఈ పదవిలో ఆతను ఏడాది పాటు కొనసాగుతాడు .
వినియోగదారుల ఫిర్యాదులకు యాప్
- వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి THE CONSUMER MOBILE APP ను కేంద్రం ప్రారంభించింది.
- ఈ యాప్ లో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు . సులభంగా ఉండే సమస్యలను 15 రోజుల లోపు క్లిష్టమైన ఫిర్యాదులను 60 రోజులలో పరిష్కరిస్తామని వినియోగదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మార్కెట్లోకి ఆవు పేడతో సబ్బులు
- గ్రామీణ ఖాదీ పరిశ్రమల కమిషన్ ఆవుపేడతో సబ్బులు వెదురు బొంగులతో నీళ్ల బాటిల్ ను తయారు చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వీటిని మార్కెట్లోకి విడుదల చేసారు.
- సబ్బు ధర 150/-, నీళ్ల బాటిల్ ధర 560/-.
- కేంద్రీయ ఉత్పత్తులను తాము ప్రోత్సహిస్తానని నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు.
Current Affairs Telugu October 2nd 2019| October Current Affairs Telugu
SC, ST చట్టంపై సుప్రీం కోర్ట్ వెనక్కి
- షెడ్యూల్డ్ కులాలు తెగలు వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018 లో ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీం కోర్ట్ ఉపసంహరించుకుంది.
- SC, ST ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు అని అంటరాని వారుగా, వేధింపులకు, సామజిక బహిష్కరణలకు గురవుతున్నారని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ M R షా, జస్టిస్ B R గవాయ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
- SC, ST చట్టం కింద నమోదు అయ్యే తప్పుడు కేసులకు మానవ వైఫల్యమే తప్ప కుల వ్యవస్థ కారణం కాదు.
To listen Current Affairs in Telugu : Click Here
No comments:
Post a Comment