Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఆంధ్రప్రదేశ్ మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా వి లక్ష్మణరెడ్డి నియమితులయ్యారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
రెండేళ్లపాటు ఈ కమిటీ కొనసాగనుంది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఒకసారి వాడిపారేసిన ప్లాస్టిక్ తో
ఒకసారి వాడిపారేసిన ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే చేటు గురించి అంతగా చింతించాల్సిన అవసరంలేదు ఇక ఉండకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి ప్లాస్టిక్ తో అత్యంత నాణ్యమైన వాహన ఇంధనాలు డిటర్జెంట్ తయారీకి ఆస్కారం కల్పించే సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.
నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు దీన్ని ఆవిష్కరించారు
పరిశోధకులు కేటాలిటిక్ ప్రక్రియ ద్వారా ప్లాస్టిక్ వ్యర్దాల్లోని పాలిథిన్ మాలిక్యూల్స్ ను అత్యంత నాణ్యమైన దృఢమైన ద్రవరూప హైడ్రోకార్బన్లు గా విజయవంతం గా మార్చారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
మేయో క్లినిక్ తో ఏ ఐ జి ఒప్పందం
అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరలో భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాలోని మేయో క్లినిక్ తోఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఒప్పందం కుదుర్చుకుంది.
మేయోక్లినిక్ కేర్ నెట్ వర్క్ లో భాగమైన తొలి భారతీయ హాస్పిటల్ ఏ ఐ జి అని సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డీ . నాగేశ్వరరెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment