Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ముర్రే ఖాతాలో తొలి టైటిల్ప్రపంచ మాజీ నంబర్ వన్ బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండ్రీ ముర్రే రెండున్నరేళ్ల తరువాత తొలి టైటిల్ సాధించాడు.
యురోపియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 243ర్యాంకర్ ముర్రే 3-6,6-4,తో ప్రపంచ 18వ ర్యాంకర్ మూడు గ్రాండ్ స్లామ్ ల విజేత వావ్రిన్కా (స్విట్జార్లాండ్ )పై గెలుపొందాడు.
భారత 65వ గ్రాండ్ మాస్టర్ గా రౌనక్ సిద్వానీ
భారత్ నుంచి చెస్ లో మరో గ్రాండ్ మాస్టర్ అవతరించాడు.
నాగపూర్ కు చెందిన రౌనక్ సిద్వానీ భారత 65వ గ్రాండ్ మాస్టర్ గుర్తింపు పొందాడు.
రౌనక్ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో జి ఎమ్ హోదా పొందిన ఏడో ప్లేయర్ గా గుర్తింపు పొందాడు ఇతని వయస్సు 13ఏళ్ళ 9నెలలు 28రోజులు.
ఇతనికంటే ముందు జి ఎమ్ హోదా పొందిన ప్లేయర్ రికార్డ్ సెర్గీ కర్జాకిన్ రష్యా 12ఏళ్ళ 7నెలలు.
భారత్ నుంచి డీ గుకేశ్ 12ఏళ్ళ 7నెలల 17రోజులు.
ప్రజ్ఞానంద 12ఏళ్ళ 10నెలల 13రోజులు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
శ్రీకృష్ణ ప్రియ కు కాంస్యంఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హైదరాబాద్ అమ్మాయి కుదరవల్లి శ్రీకృష్ణ ప్రియ కాంస్య పతాకాన్ని సాధించింది.
ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్లకు పతకాలు
జాతీయ జూనియర్ యూత్ బాలుర లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెయిట్ లిఫ్టర్లు ఆకట్టుకున్నారు.
పురుషుల యూత్ 89కేజీలా,విభాగంలోస్వర్ణం నెగ్గిన ఎ ఎస్ ఆర్ కె యాదవ్
జూనియర్ పురుషుల విభాగం లో రజతం సాధించాడు యూత్ కేటగిరీ లో మొత్తం 268కేజీ ల బరువెత్తాడు.
యూత్ బాలికల71కేజీ ల విభాగంలో,పిధాత్రీ(ఆంధ్రప్రదేశ్) రజతం సొంతంచేసుకుంది ఆమె మొత్తం 170కేజీ బరువెత్తింది.
పురుషుల యూత్ 81కేజీ ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ జి. రవిశంకర్ మొత్తం 237కేజీల బరువెత్తి కాంస్య పతాకాన్ని కైవసం చేసుకున్నాడు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
పరాశరన్ కు మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజెన్ అవార్డుఅపార జ్ఞానం క్రమశిక్షణ నైతికత విలువలు పాటించడం వల్ల న్యాయకోవిదుడు మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ ఉన్నతమైన వ్యక్తిగా గౌరవాన్ని అందుకుంటున్నారని ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు తెలిపారు.
ఓల్గా కు శిఖామణి సాహితి పురస్కారం
ప్రముఖ రచయిత్రి ఓల్గాకు శిఖామణి సాహితి పురస్కారం దక్కింది. యానాంలోని యర్రా వెంకటరత్నం గీతా భవనం లో జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత డీ విజయకుమార్ చేతులమీదుగా అవార్డ్ 10వేల నగదును ఆమె అందుకున్నారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఈ మేలి ముత్యం 8వెల ఏళ్ళనాటివిప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మేలి ముత్యాన్ని అబుదాబి లో ప్రదర్శించారు.
ఈ ముత్యం సుమారు 8వేల ఏళ్ళ వయసు అని నవీనశిలయుగం నాటిదని శాస్త్రవేత్తలు తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి సమీపంలోని మరావా ద్విపంలో పురావస్తు నిపుణుల జరిపిన తవ్వకాల్లో ఇది బయట పడింది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
పొద్దుతిరుగుడు గింజలతో విటమిన్ ఇపొద్దుతిరుగుడు గింజలను ఉపయోగించి శక్తి వంతమైన విటమిన్ ఇ సృష్టించవచ్చని ఐ ఐ టి మద్రాస్ బయోటెక్నాలజీ విభాగం ఆచార్యులు పరిశోధనలో గుర్తించారు.
పొద్దుతిరుగుడు గింజలతో విటమిన్ ఇ ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చని , ఇప్పుడు లభిస్తున్న విటమిన్ ఇ తో పోల్చుకుంటే 10రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చని తేల్చారు.
No comments:
Post a Comment