CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
అయోధ్య కేసు 17 నాటికీ విచారణ ముగింపు
- అయోధ్య స్థల వివాద కేసు విచారణను అక్టోబర్ 17 నాటికల్లా ముగించేయనట్లు సుప్రీమ్ కోర్ట్ వెల్లడించింది.
- గతంలో నిర్దారించినట్లు అక్టోబర్ 18న కాకుండా ఒక రోజు ముందే విచారణను పరిసమాప్తం చేయాలి అని తాజాగా నిర్ణయించింది.
- కీలకమైన ఈ కేసుఫై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం, రోజువారి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కావున దర్మాసనం పేర్కొన ప్రకారం అక్టోబర్ 14వ తేదీ నాటికీ ముస్లిం తరుపు వాదనలు పూర్తి అవుతాయి. హిందువుల తరుపున అక్టోబర్ 16 కల్లా వాదనలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ధర్మాసనం నవంబర్ 17వ తేదీ నాటికీ తన తీర్పును ప్రకటించాల్సి ఉంది. అదే రోజున జస్టిస్ రంజన్ గొగోయ్ పదవి విరమణ పొందుతారు. సంబంధిత పక్షాలు సరికొత్త సాక్ష్యాలతో వస్తే ఇప్పుడిక అనుమతించే ప్రసక్తే లేదని ధర్మాసనం చెప్పింది.
- అలాహాబాద్ హై కోర్ట్ కి సమర్పించి ఉన్న రికార్డులు ఇతరత్రా సమర్పణల ప్రాతిపదికన మాత్రమే ఆయా పక్షాల రిజాయిండర్లు ఉండాలి అని స్పష్టం చేసింది.
CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
పట్టాలు ఎక్కిన తొలి ప్రైవేట్ రైలు
మన దేశం లో తొలి సారి ప్రైవేట్ రైలు ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లో శుక్ర వారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రారంభించారు. ఆ ప్రైవేట్ రైల్ పేరు తేజస్ ఇది లక్నో- ఢిల్లీ మధ్య IRCTC ఆధ్వర్యంలో ప్రారంభించారు.జాబిల్లి ఫై విద్యుదావేశా కణాలు
- జాబిల్లి ఉపరితలంపై విద్యుదావేశా పూరిత కణాల జాడను చంద్రయాన్ 2 గుర్తించింది.
- చంద్రుడు చుట్టూ పరిభ్రమిస్తున్న ఆర్బిటలోని లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్సరే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్ వాటి ఉనికిని ట్విట్టర్ లో తెలిపింది.
- కణాల తీవ్రత మధ్య వ్యత్యాసాలను అది గుర్తించింది అని తెలిపింది.
CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
మూడు కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్
- దేశం లో విద్యుత్ వాహనాల వినియోగం పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం తాజాగా చర్యలను ప్రకటించింది. వాటి ఛార్జింగ్ కు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు లైసెన్స్ అవసరం లేదు.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ లో మాత్రం 2003 విద్యుత్ చట్టం మేరకు విద్యుత్ నియంత్రణ కమిషన్ నిర్దారించే టారిఫ్ ప్రకారం వసూలు చేస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ జలాశయాలు ఇంకా కొన్ని ఖాళీగానే ఉన్నాయి
రాష్ట్రము లో చిన్న నీటి చెరువులు 38363 ఉన్నాయి మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 201.90 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 53.27 టీఎంసీలు.CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర జీవనం
- రసాయన ఎరువుల వాడకంతో సారం కోల్పోతున్న భూమి గోఆధారిత పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడడంతోపాటు భూమి సారవంతంగా మారుతుంది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరి చందన్ పేర్కొన్నారు.
- దక్షిణ భారత గోఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల, వినియోగ దారుల 3వ సమ్మేళనానికి రాష్ట్రము నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు .
- ముఖ్యంగా ఈ కార్యక్రమంలో 3రోజుల పాటు జరిగే సేంద్రియ పంటలకు మార్కెటింగ్ గిట్టుబాటు ధర, సేద్యం లో ఎదురైయే సమస్యసలను వివరించినట్టు గోఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సహకార సంఘ అధ్యక్షుడు ముత్తవరపు మురళి కృష్ణ తెలిపారు.
CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
ఆస్ట్రేలియా చదువుకు రాయితీ
ఆస్ట్రేలియా లోని PLINDERS విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు రాయితీ కల్పించేందుకు ఏపీ ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ ఒప్పందం కుదుర్చుకునింది.రేపో రేటు తగ్గించిన RBI
- రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వరుసగా 5వ సారి రెపోరేటు తగ్గించింది ప్రస్తుతం 5.40% గా ఉన్న రెపోరేటును 0.25% తగ్గించి 5.15% గా నిర్ణయించింది. రివర్స్ రెపోరేటును 4.90% బ్యాంకు రేటును 5.40%గా నిర్ణయించింది.
- 2019-2020 ఆర్థిక సంవత్సరానికి, 2020-2021వ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాను 7.2కు సవరించారు.
- అక్టోబర్ 4న జరిగిన RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన జరిగిన పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
మహాత్మ గాంధీ 150వ గాయంతి
- మహాత్మ గాంధీ 150వ గాయంతి ని పురస్కరించుకొని అహ్మదాబాద్ లోని సబర్మతి తీరంలో అక్టోబర్ 2న నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
- వాడి పారేసిన ప్లాస్టిక్ ను నిర్ములించే లక్షాన్ని 2022 నాటికీ సాధించాలని ఆయన పిలుపు నిచ్చారు.
- గాంధీజీ స్మారకార్థం 150 రూపాయల నాణేలను విడుదల చేసారు.
- గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అక్టోబర్ 2న నిర్వహించిన స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ - 2019 పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకున్నారు.
- దేశంలో 690 జిల్లా లోని 17400 గ్రామాలూ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే లో పాల్గొన్నాయి. జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లా ప్రధమ స్థానం లో నిల్చింది.
బ్లాక్ చైన్ టెక్నాలజీ తో అమెరికాకు రొయ్యల ఎగుమతి
- దేశంలో తొలిసారిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది.
- కృష్ణ జిల్లా గుడివాడలోని సంధ్య ఆక్వా నుంచి అమెరికా లో ఎంపిక చేసిన శ్యాం క్లబ్ స్పోర్ట్స్ కు చేరేంతవరకు అనుక్షణం నాణ్యతను పరిశీలించడానికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించనున్నారు.
CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
అవినాష్ కు 13వ స్థానం
- ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ కు పతకం రాకున్నా మరో ఒలంపిక్ బెర్త్ దక్కింది.
- 3000 మీటర్ల స్టిపుల్ చెస్ ఫైనల్ లో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ 13వ స్థానం లో నిలిచాడు,వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలంపిక్స్ అర్హత సాధించాడు.
ఆసియా బాడీ బిల్డింగ్ లో ఆర్మీ మేజర్ కు రజతం
- భారత ఆర్మీ మేజర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆసియా బాడీ బిల్డింగ్ పోటీలో అదర గొట్టాడు.
- ఇండోనేషియా లోని బాటమ్ నగరం లో జరిగిన 53వ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో రజిత పతకం గెలుచుకున్నాడు.
- అతను పాల్గొన్న తొలి పోటీలోనే పతకం సాధించడం చాల సంతోషంగా ఉంది అని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
CURRENT AFFAIRS TELUGU OCTOBER 2019
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా పూనమ్ మాలకొండయ్య
పశుసంవర్ధక మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా ఉన్న పూనమ్ మాలకొండయ్య ను వ్యవసాయ సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
No comments:
Post a Comment