Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఉద్యోగాలకు ఇక ఇంటర్వ్యూ లు ఉండవుఅమరావతి APPSC ఫై సీఎం జగన్ సమీక్షించారు ఈ సమీక్షలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.ఇకనుంచి కేవలం రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఈ విధానం వర్తిచనుంది.
అహింస సత్యాగ్రహ లతోనే ప్రపంచశాంతి
15 ఏళ్లుగా వాటిని ప్రచారంచేస్తున్న అమెరికా గాంధీ బెర్నీ ఇ మేయర్
ది అమెరికన్ గాంధీ పేరిట నేను ఒక పుస్తకం రాశాను గాంధీజీ 150 జయంతి సందర్బంగా కేంద్రం గత ఏడాది నియమించిన కమిటీ కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నన్ను ఎంపిక చేశారు.
గాంధీజీల కనిపించాలని 15 ఏళ్లుగా గుండు గీయించుకున్న.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
రాష్ట్ర అథ్లెటిక్ సంఘం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిరాష్ట్ర అథ్లెటిక్ సంఘం చైర్మన్ గా తి తి తి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి , వైస్ చెర్మన్ గా ఎస్ కామేశ్వర శర్మను ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈ సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల హైమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆకలి సమస్యలతో భారత్ కు 102వస్థానం
ఆకలి సమస్య ఎదుర్కొంటున్న 117దేశాల్లో భారత్ 102వస్థానం లో నిలిచింది
పౌష్టికాహర లోపం చిన్నారుల్లో బరువు తక్కువ సమస్య మరణాలరేటు వంటి అంశాల ప్రాతిపదికన పరిస్థితిని ఎప్పటికప్పుడు లెక్కగట్టే గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ ప్రకారం
నేపాల్ 73
పాకిస్థాన్ 94
బంగ్లాదేశ్ 88
మయన్మార్ 69
భారత్ 102
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
జాబిల్లి అంగారకుడిపై సాగుసాధ్యమేజాబిల్లి అంగారకుడిపై భవిష్యత్తులో మానవ స్థావరం ఏర్పాటు చేసుకుంటే వారికీ కావాల్సిన ఆహారపదార్దాలను అక్కడే పండించుకోవచ్చు.
ఆరెండింటి మట్టి కొన్ని పంటల సాగుకు అనుకూలంగా వుందని నెదర్లాండ్స్ లోని వెజ్ నింజన్ పరిశోధక విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు తాజాగా తేల్చారు.
మన ఐరన్ మ్యాన్ ఈశ్వర్
ప్రపంచంలో అత్యంత కఠినమైన సహస క్రీడగా పేరున్న ఐరన్ మ్యాన్ ట్రయత్లన్ పోటీల్లో తెలుగు వాడైనా మారూరి ఈశ్వర్ సత్తా చాటాడు
గుంటూరుజిల్లా లో చాగంటివారిపాలెం కు చెందిన ఈశ్వర్ అమెరికాలోని లూయిస్ విల్లి లో జరిగిన ఐరన్ ట్రయ త్లన్ లో బరిలోకి దిగి విజయవంతంగా రేసులు ముగించాడు.
ఈ పోటీల్లో పాల్గొన్న ఏకైక భారతీయుడు అతనే 180. 25కిలోమీటర్ల సైక్లింగ్ 42. 2కిలోమీటర్ల పరుగును 17గంటల్లో పూర్తి చేయాలి 3. 86కిలోమీటర్ల ఈత
అయితే నీటిలో బాక్టీరియా సమస్యవల్ల ఈత పోటీని రద్దు చేశారు.
మిగతా రెండు పోటీల్ని ఈశ్వర్ 12గంటల 36నిముషాల లోనే ముగించి ఐరన్ మ్యాన్ హోదా ను అందుకున్నాడు ఈశ్వర్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
కెప్టెన్ మిథాలికి ఇది వందో విజయం
దక్షిణాఫ్రికా తో వడోదర లో జరిగిన మహిళల మూడోవన్డేలో 6పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇది కెప్టెన్ గా మిథాలికి వందో విజయం ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్.
బుద్ధుని జాడలు స్మరిస్తూ
భారత్ ,నేపాల్ లో వున్న బుద్ధునికి సంబందించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించేలా భారతీయ రైల్వే మొదటి సారిగా బుద్దిస్ట్ సర్క్యూట్ రైలును నడపనుంది.
అక్టోబర్ 19 నుంచి 26 వరకు ఈ రైలు ఆయా దివ్య ప్రదేశాలకు చుడుతూ పరుగులు తీయనుంది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
నాసా కొత్త స్పేస్ సూట్చంద్రుడు మీద నడిచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త అంతరిక్ష సూట్ ను తయారు చేసింది ఎక్సట్రా వెహిక్యూలర్ మొబిలిటీ యూనిట్ గా పిలిచే దీని ఫోటో ను 16వ తేదీ విడుదల చేసింది.
ఇది అచ్చం మానవుడి శరీరంలా కనిపించే చిన్న అంతరిక్ష వాహనం.
No comments:
Post a Comment