Current Affairs Telugu October month 2019
ఈ టీవీ భారత్ వైష్ణవజనతో భక్తిగీతానికి ప్రధాని అభినందనలు- గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈ టీవీ భారత్ రూపొందించిన వైష్ణవజనతో గీతం అందరిని విషేషంగా ఆకట్టుకుంది.
- రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు హైదరాబాద్ లో ఆవిష్కరించిన. ఈ గీతానికి ప్రధాని నరేంద్ర మోడి, ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయడు, పలువురు కేంద్రమంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు.
విజయవాడలో పోక్సో ప్రత్యేక కోర్ట్ ప్రారంభం
- న్యాయవాదులు అవకాశాలను అందిపుచ్చుకొని వృత్తి నైపుణ్యం సాధించాలని అని రాష్ట్ర హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యామూర్తి ప్రవీణ్ కుమార్ సూచించారు.
- బుధవారం విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు పోక్సో (చిన్నారుల ఫై లైంగిక వేధింపులు నిరోధక చట్టం) కేసులు పరిష్కరానికి ప్రత్యేక న్యాయస్థానానికి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రారంబించారు.
- రాష్ట్రంలో 8 జిల్లాల్లో పోక్సో కేసులు పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కానున్నాయి.
Current Affairs Telugu October month 2019
ఆధిత్యునికి కిరణ స్పర్శ ఏడు నిముషాలు పాటు భక్తులకు కనువిందు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని భానుడి కిరణాలు తాకాయి. ఈ అపురూప దృశ్యం బుధవారం ఆవిష్కృతమైంది. ఆ సమయంలో సూర్యనారాయణస్వామి బంగారుఛాయలోకి మారి దర్శన మిచ్చారు.
- సూర్యడు దక్షిణంలోకి మారె సందర్భంగా ఈ కిరణ స్పర్శ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.
- ఉదయం 6.04 నిమిషాలకు సూర్యకిరణ స్పర్శ ప్రారంభంమై 6.11 నిమిషాల వరకు కొనసాగింది.
Telugu current affairs October 2019
స్వచ్ఛ రైల్-స్వచ్ఛ భారత్ లో విజయవాడకు 7 వ ర్యాంక్
- స్వచ్ఛ రైల్ -స్వచ్ఛ భారత్ లో విజయవాడ రైల్వే స్టేషన్ కు 7 వ స్థానం లభించింది స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా రైల్వే శాఖ స్వచ్ఛ రైల్ -స్వచ్ఛ భారత్ పేరిట రైల్వేస్టేషన్లకు శుభ్రత ఆధారంగా 2016 ర్యాంకులు ప్రకటించింది.
- 2016 నుంచి 2018 వరకు A, A1, గ్రేడ్ పరిధిలోని 407 స్టేషన్ లకు ర్యాంకులు కేటాయించగా ఈ ఏడాదిలో నాన్ సబ్ అర్బన్, సబ్ అర్బన్ పరిధిలో 720 స్టేషన్లకు విస్తరించారు.
- మొత్తం 1000 మార్కులు ప్రతి ప్రాతిపదికలో ఈ ఏడాది జైపూర్ కి 931.75 మార్కులు, జోద్పూర్ కి 927. 19 మార్కులు, దుర్గాపూర్ కి 922. 50 మార్కులతో తొలి 3 స్థానాలలో నిలిచాయి.
- తొలి పది స్థానాలలో తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ స్టేషన్ కు మాత్రమే చోటు దక్కింది. ఈ స్టేషన్ 908. 81 మార్కులతో 7 వ స్థానంలోనిలిచింది .
- హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ (890. 64) 17 ర్యాంకు సికింద్రాబాద్ కు 42వ ర్యాంక్.
- జోన్లలో నాలుగో స్థానం నిలిచినా దక్షిణ మధ్య రైల్వే వాయువ్య రైల్వే నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది.
- తూర్పు కోస్తా రైల్వే 9 వ ర్యాంక్ సాధించింది, విజయవాడ 7వ ర్యాంక్, హైదరాబాద్ 17వ ర్యాంక్, సికింద్రాబాద్ 42వ ర్యాంక్, సామర్లకోట 45వ ర్యాంక్, వరంగల్ 51వ ర్యాంక్, తిరుపతి 70వ ర్యాంక్, నెల్లూరు 81వ ర్యాంక్, విశాఖపట్నం 84వ ర్యాంక్ ,పలాస 92వ ర్యాంక్ సాధించాయి.
Current Affairs Telugu October month 2019
వెంకన్న లడ్డుకు కేరళ జీడిపప్పు
- తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదం తయారీకి వాడే జీడిపప్పు సరఫరాకు కేరళ రాష్ట్రంతో తి.తి.దే కు ఒప్పంధం కుదిరింది.
- కేరళ జీడిపప్పు నాణ్యంగా ఉంటుంది అని దీని వాడకంతో లడ్డు ప్రసాదానికి మరింత రుచి వస్తుంది అని తి. తి. దే చెబుతుంది.
- తి. తి. దే నిత్యం 4 లక్షల లడ్డులను తాయారు చేస్తుంది నిత్యం సగటున 2840 కిలోల జీడిపప్పు వినియోగిస్తుంది.
నేటి నుంచి సరస్
- వస్తూత్పత్తుల భారీప్రదర్శన సరస్ మరోసారి ఆకట్టుకోనుంది ఈ ప్రదర్శన విజయవాడలోని PWD మైదానంలో నేటి నుంచి 14వ తేదీ వరకు జరుగుతుంది.
- గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రదర్శనలో డ్వాక్రాసంఘాలు ఉత్పత్తులను విక్రయిస్తారు.
- ఆంధ్రప్రదేశ్ తో పాటు 20 రాష్ట్రాలకు చెందిన 370 సంఘాలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి మొత్తం 320 స్టాళ్లను సిద్ధంచేశారు.
Current Affairs Telugu October month 2019
సుధానారాయణమూర్తి ప్రమాణ స్వీకారం
తి. తి. దే ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా కర్ణాటకకు చెందిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధానారాయణమూర్తి శ్రీవారిసన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు.
టాయిలెట్ కాలేజీలో తొలి బ్యాచ్ పూర్తి
- మన దేశంలోని తొలి టాయిలెట్ కళాశాల నుంచి మొదటి బ్యాచ్ కి చెందిన 3200 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తం అందరూ ఉద్యోగాలు తెచ్చుకున్నారు.
- మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో హార్పిక్ వరల్డ్ టాయిలెట్ కాలేజీ వుంది రెకిట్ బెన్కైసర్ అనే బ్రిటిష్ సంస్థ గతఏడాది ఆగస్టు నెలలో దీన్ని నెలకొలిప్పింది.
Current Affairs Telugu October month 2019
సచిన్ కు స్వచ్ఛతా పురస్కారం
- క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యక పురస్కారం లభించింది.
- పరిసరాలా పరిశుభ్రత ఫై ప్రజలలొ అవగాహనా పెంచడంతో పాటు స్వచ్ఛతా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను అతడికి ఆత్యంత ప్రభావశిల స్వఛ్చత రాయబారి అవార్డు దక్కింది.
- మహాత్మగాంధీ 150 వ జయంతి పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ గోవింద్ చేతులమీదిగా సచిన్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
200 మీటర్ల రేసులో కొత్త విజేత
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో 200 మీటర్ల రేస్ లో అమెరికాకు చెందిన నోవా లైల్స్ ఛాంపియన్ అయ్యాడు అతను 19.83 సెకండ్స్ లో లక్ష్యాన్ని చేరుకున్నాడు.
సి ఏ సి కి కపిల్ రాజీనామా
అంబుడ్స్ మాన్ D K జైన్ నుంచి విరుద్ధ ప్రయోజనాలు నోటీసు వచ్చిన నేపథ్యంతో ముగ్గురు సభ్యులు క్రికెట్ సలహా సంఘానికి కపిల్ దేవ్ రాజీనామా చేశాడు.
Current Affairs Telugu October month 2019
ప్లాస్టిక్ వ్యర్థాలతో భారీ చరఖా
- మహాత్ముడి 150 వ జయంతి వేడుకుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసిన భారీ చరఖాను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అక్టోబర్ 1 న ప్రారంబించారు.
- ఈ చరఖాను 1250 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ రుణ భారం 2020 మార్చ్ నాటికీ 3.41 లక్షల కోట్లు
- ఆంధ్రప్రదేశ్ రుణ భారం 2020 మార్చ్ నాటికీ 3.41 లక్షల కోట్లుకు చేరనుంది ఏటా సగటున 17 వేలకోట్లకు పైచిలుకు చొప్పున వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రప్రభుత్వం 89,994 కోట్ల రుణాలు తిరిగి చెలించాల్సి ఉంటుంది.
- రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులపై భారత రిజర్వు బ్యాంకు అక్టోబర్ 1వ తేదీన విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Current Affairs Telugu October month 2019
జలశక్తి అభియాన్ కింద నీటి సంరక్షణలో అన్ని కేటగిరిలో మెరుగైన ఫలితాలు సాధించిన ఆంధ్రప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్ లోని వైస్సార్ కడప జిల్లా 82.16 పాయింట్స్ తో దేశం లో అగ్ర స్థానంలో నిలిచింది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా 76. 14 పాయింట్స్ తో 3 వ స్థానం నిలచింది.
- భూమి లో తేమ శాతాన్నీ పెంచాలనే ఉద్దేశంతో జలశక్తి అభియాన్ కింద దేశంలో ఎంపిక చేసిన 253 జిల్లలో జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యకమాలను అమలుచేసింది.
No comments:
Post a Comment