Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 కరెంటు అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019 మీకోసం
- విదేశీ స్త్రీ పురుష అవివాహాహితులపైనా ఆంక్షలు సడలింపు విదేశాలకు చెందిన స్త్రీ పురుషులు కలిసి ఒకే గదిలో దిగడాన్ని అనుమతించాలని సౌదీ అరేబియా సర్కారు నిర్ధారించింది.
- సౌదీకి చెందిన స్త్రీ పురుషులు హోటల్లో దిగాలంటే తమ మధ్య సంబంధాన్ని రుజువు చేసే పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. ఇకపై విదేశీయులకు ఇది వర్తించదని అధికార వర్గాలు తెలిపాయి. 49 దేశాలలో చెందిన పర్యాటకులకు సౌదీ అరేబియా తలుపులు తెరిచింది.
నోట్ల రద్దు GST తో మేలు
పన్నుల అక్రమాలకు అడ్డుకట్ట: నిర్మల సీతారామన్ నోట్ల రద్దు వస్తుసేవల పన్ను సంస్కరణలతో పన్నులు వసూళ్ళలో చోటు చేసుకొనే అక్రమాలకు అడ్డుకట్ట పడిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019
మార్కెట్లోకి హరిత టపాసులు
- తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే హరిత టపాసులు అందుబాటులోకి వచ్చాయి ఇది వరకటి బాణ సంచలాగే శబ్దం, వెలుగు ఇచ్చినప్పటికీ కాలుష్యాన్ని 30 నుంచి 90% వరకు తగ్గించే శక్తి ఈ టపాసులు ఉంది.
- ఈ హరిత బాణా సంచాను కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ శనివారం ప్రదర్శించారు.
- కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని సెంటర్ పర్ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ రీసెర్చ్ వీటిని తయారు చేసింది.
- సుప్రీం కోర్టు 2017లో దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో టపాసుల వాడకాన్ని నిషేదించింది.కారణం బాణ సంచా వెదజల్లే కాలుష్యం విపరీత స్థాయికి చేరిందన్న కారణంతో.
అమరులైన సైనికుల కుటుంబాలకు అదనపు సాయం
- సైన్యంలో సేవలందిస్తూ అమరులైన వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న 2 లక్షల ఆర్ధిక సాయాన్ని 8 లక్షలకు పెంచడానికి రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ సూత్ర ప్రాయ ఆమోదం తెలిపారు.
- దీనిని సైనిక యుద్ధ వీరులు సంక్షేమ నిది నుంచి దీనిని అందజేయనున్నారు.
Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019
ఆరోగ్య భీమా ఉంటేనే అమెరికా
- నవంబర్ నుంచి కొత్త నిబంధన 35వేల మంది భారతీయులపై ప్రభావం చూపనుంది ఆమోద ముద్ర వేసిన ట్రాంప్ అమెరికా వలస రావాలని ప్రయత్నించేవారికి ఆరోగ్య బీమా లేకపోతే తిప్పలే . ఆ భీమా లేనివారు వైద్య ఖర్చులు సొంతంగా భరించగలమని నిర్ణయించుకోలేని వారు ఇమ్మి గ్రాంట్ వీసా ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించారు.
- బీమా లేదా ఆర్ధిక పరపతిపై ఏదో ఒక ఆదరాన్ని వీసా పరిశీలన పూర్తిఅయ్యేలోగా చూపించడం అనివార్యం. ఆ తరువాత, లేదా అమెరికాలో ప్రవేశించాక వాటిని ఇస్తామంటే అంగీకరించరు.
- ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపు దారుల ప్రయోజనాలను పరీక్షించడానికి ఆ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షకుడు డోనాల్డ్ ట్రాంప్ ప్రకటించారు.
- కుటుంబ సభ్యుల ద్వారా అమెరికా ఏటా 35 వేల మంది భారత్ నుంచి వలస వస్తుంటారని అంచనా నవంబర్ 3 నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని శ్వేతా సౌధంలోని వలస విభాగ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాలో అడుగు పెట్టిన 30 రోజుల్లోగా ఆమోదిత ఆరోగ్య భీమా పొందడం వలసదారులకు ఇక తప్పని సారి.
Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019
కలిసి కట్టుగా ఉగ్రవాద నిర్ములన
- భారత్ బాంగ్లాదేశ్ ప్రధానుల నిర్ణయం భారత్, బంగ్లాదేశ్ ల మధ్య సంబంధాలు ప్రపంచానికే ఆదర్శ్యం కావాలని రెండు దేశాల ప్రధానులు మోడీ, షేక్ హసీనా లు ఆకాంక్షించారు.
- ఉగ్రవాద నిర్ములనకు కలిసి పనిచేయాలని ఇరు ప్రధానులు నిర్ణయించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఢాకా విశ్వ విద్యాలయం మధ్య ఓ ఒప్పందం కుదిరింది.
ఆన్ లైన్ లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్
విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లోని గుణదల సూపర్ మార్కెట్ సుబ రిజిస్టర్ కార్యాలయాల్లో స్థలాలు ఇళ్లకు ఆన్ లైన్ ద్వారా 7వ తేదీ సోమవారం నుంచి ప్రవేశ పెట్టనున్నారు.Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019
తిరుపతిలో రెవిన్యూ సర్వే అకాడమీ ఏర్పాటు
- సర్కారు సూత్ర ప్రాయ నిర్ణయం 41 ఎకరాల కేటాయింపు స్టేట్ ఆఫ్ అర్ట్ గా చేయాలనీ ప్రణాళిక సిద్ధం చేసారు.
- తిరుపతి నగరం లో రెవిన్యూ సర్వే అకాడమీ ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ అనే అత్యాధునిక టెక్నాలజీతో దేశంలోనే ప్రధమంగా ఆంధ్ర ప్రదేశ్ భూములను రిసర్వే చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చంద్రయాన్ 2 జాబిల్లి చిత్రాలు విడుదల
- చంద్రయాన్ 2 లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తీసిన ఛాయా చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది.
- జాబిల్లి నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ కెమెరా ద్వారా ఆర్బిటార్ తీసిన చిత్రాలు బో గు స్లావ్ స్కి ప్రాంతానికి సంబందించినవి అని ఇస్రో తెలిపింది.
- సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం 3 కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయ ను ఆర్బిటర్ తన చిత్రాలలో బంధించింది.
- దక్షణ ధృవానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాలలో పెద్ద పెద్ద రాళ్ళవంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతలు లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది.
Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 VIDEO CLASS : CLICK HERE
No comments:
Post a Comment