Current Affairs Telugu 2019 October month, best current affairs website in Telugu
హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ J K మహేశ్వరీ
- ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కు తొలి పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిని నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
- ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్ట్ లో సీనియర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న ఆయన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీమ్ కోర్ట్ కొలిజియం ఆగష్టు 22న కేంద్ర ప్రభుత్వనికి సిఫార్సు చేసింది.
- ఇతను 1961 జూన్ 29 న మధ్య ప్రదేశ్ లో జన్మించారు. 1985 నవంబర్ లో న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టారు. సివిల్ క్రిమినల్ రాజ్యాంగ సంబంధిత కేసుల్లో నిష్ణాతుడిగా ఖ్యాతి గడించారు. 2008లో నవంబర్ 25న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
- రాజ్యంగంలో 217 (1), అధికరణ ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో ఆంధ్ర ప్రదేశ్ కు హైకోర్ట్ కి తొలి పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి సుగమమైంది.
Current Affairs Telugu October 2019
నేడే వాహనమిత్ర
- సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఉండి వాటిని నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించే y s r వాహన మిత్ర పధకం శుక్రవారం ప్రారంభించారు.
- ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి 10000/- చొప్పున సాయం అందించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పారంభించారు దేని ద్వారా 1,73,531 మంది డ్రైవర్లు లబ్ది పొందుతారు.
N I N మాజీ సంచాలకులు గోపాలన్ కన్నుమూత
- జాతీయ పోషకాహార సంస్థ మాజీ సంచాలకులు డా. సి. గోపాలన్ (101) చెన్నై లో మృతిచెందారు.
- వ్యైద్యం పోషకాహార రంగాలలో డా.సి.గోపాలన్ అనేక పరిశోధనలు చేసారు 1974-79 వరకు ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గ పని చేసారు. 1970 లో పద్మశ్రీ, 2003 లో పద్మ భూషణ్ అవార్డులను ప్రధానం చేసింది.
Current Affairs Telugu October 2019
29 న బాపట్ల లో ఆచార్య ఎన్ జి రంగ 50వ స్నాతకోత్సవం
ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం 50 వ స్నాతకోత్సవం తేదీ ఖరారు అయింది రాష్ట్ర గవర్నర్ విశ్వ విద్యాలయం కులపతి బిశ్వ భూషణ్ హరి చందన్ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు యూనివర్సిటీ కి లేఖ పంపారు.
చేనేతకు ప్రచార కర్తగ వ్యవహరిస్తున్న పూనమ్ కౌర్
ఐక్యరాజ్య సమితి లో భారత శాశ్వత ప్రతినిధి సయ్యీద్ అక్బరుద్దీన్ కు గాంధీ జయంతి ని పురస్కరించుకొని మహాత్మ గాంధీ చిత్ర పటాన్ని అందిస్తుంది.ఢిల్లీ - కాట్రా వందేభారత్ ప్రారంభం
- కేంద్ర హోమ్ మంత్రి అమీత్ షా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తో కలసి ఢిల్లీ - కాట్రా వందేభారత్ ఎక్ష్ప్రెస్స్ ను గురువారం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు.
- 370 అధికరణ రద్దు వందేభరత్ ను కాట్రా కు ప్రవేశపెట్టడం ద్వారా జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలు అవుతుంది అని అమీత్ షా చెప్పారు.
Telugu Current Affairs October 2019
హంపి కి 3వ ర్యాంక్భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తాజాగా ఫిడే విడుదల చేసిన మహిళల ర్యాంకింగ్ లో 3 వ స్థానానికి ఎగబాకింది ఆనంద్ 9వ స్థానం మాగ్నస్ కార్ల్ సన్ అగ్ర స్థానం లో కొనసాగుతున్నారు.
మార్కెట్ కమిటి చైర్మన్ పదవుల్లో సగం మహిళలకే
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో మహిళలకు సగం ఇవ్వల్సింది గ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
36 ఏళ్ళ తరువాత మహిళల 200 మీటర్ల లో బ్రిటన్ కు స్వర్ణం
మహిళల 200 మీటర్ల ఫైనల్ లో 23 ఏళ్ళ బ్రిటన్ అథ్లెట్ ఆషెర్ స్మిత్ పూర్తి ఆది పత్యం సాధించింది 21.88 సెకండ్లలో గమ్యం చేరిన ఆమె స్వర్ణ పతకం నెగ్గింది.
No comments:
Post a Comment